తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆపిల్ ఐఫోన్ల తయారీకి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నీటి ట్యాంకు నిర్వహణ పనులు చేస్తుండగా ఊపిరాడక వారు మరణించినట్లు సమాచారం.
తమిళనాడులోని హోసూర్ ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలోని వాటర్ ట్యాంకుకు సోమవారం ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వారు ట్యాంకులోకి వెళ్లగా ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.
ఘటనపై స్పందించిన తమిళనాడు మంత్రి
ఈ ప్రమాదంపై తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి విరుద్ధ్ మగల్ కీర్తన స్పందించారు. కార్మికుల భద్రత, గౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
టాటా ఎలక్ట్రానిక్స్ స్పందన కోసం ఎదురుచూపులు
ఈ ఘటనపై సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలపై దర్యాప్తు ద్వారా స్పష్టత రావాల్సి ఉంది.
