ముంబైలో టపాసులు నిషేధం.. రాకెట్లు, స్కై షార్ట్స్ పేల్చొద్దు.. బృహన్ ముంబై కార్పొరేషన్

ముంబైలో టపాసులు నిషేధం.. రాకెట్లు, స్కై షార్ట్స్ పేల్చొద్దు.. బృహన్ ముంబై కార్పొరేషన్

దీపావళి వేళ టపాసుల మోతతో ముంబై నగరంలో ధ్వనికాలుష్యంతో పాటు అగ్నిప్రమాదాలు భారీగా పెరగడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాకెట్లు, థౌజండ్ వాలాలు వంటి ఆకాశంలో పేలే టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించింది. చిన్న చిన్న నేల టపాసులు మాత్రమే కాల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిషేధం నవంబర్ 25 వరకు అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ  దీపావళికి  ముంబై నగరంలో జరి142 అగ్నిప్రమాదాలు జరిగితే.. అందులో 137 ప్రమాదాలు టపాసుల వల్లే జరిగాయట. ఇది స్వయంగా పరిశీలించిన బీఎంసీ అధికారులు.. ప్రమాదాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. టపాసులు పేల్చుకుంటే పేల్చుకోరి..రాకెట్లు, థౌజండ్ వాలా వంటి  ఆకాశంలో పేలే టపాసులు  మాత్రం వద్దు అని రెండు వారాలు అంటే నవంబర్ 25 వరకు నిషేధించారు. 

అయితే థానే, నవీ ముంబై, మీరా భయందర్, కళ్యాణ్ డోంబివాలి, భీవండి, ఉల్హాస్ నగర్ వంటి థానే జిల్లాలోని  మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు వారాలు పాటు అంటే జనవరి 8వరకు నిషేధం విధించారు. పాల్ఘర్, రాయగడ్ వంటి  బీఎంసీ పరిధిలోని జిల్లాల్లోని విరార్, వసాయి, పన్వే ల్ ప్రాంతాలకు మాత్రం ఇది వర్తించదని  అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.