Vijay Rashmika: ఫారెన్లో విజయ్–రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. రొమాంటిక్ పిక్, ఫ్యామిలీ ఫొటోలు వైరల్!

Vijay Rashmika: ఫారెన్లో విజయ్–రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. రొమాంటిక్ పిక్, ఫ్యామిలీ ఫొటోలు వైరల్!

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈసారి దీపావళి వేడుకలను విదేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో ఉన్న ఈ జంట.. అక్కడే సంప్రదాయబద్ధంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంది. దేవరకొండ కుటుంబమంతా కలిసి గోమా (GOMA) హోమం నిర్వహించి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక తమ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా ఇద్దరూ కలిసి కనిపించిన రొమాంటిక్ పిక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ జంట షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జపాన్‌లో గోమా (హోమం)..

తమ కుటుంబ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. జపాన్‌లో ఉన్నప్పటికీ దీపావళి సందర్భంగా గోమా (హోమం) నిర్వహించుకున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “జపాన్‌లో ఉన్నా దీపావళికి గోమా (హోమం) నిర్వహించుకునేలా చూసుకున్నాం. మా దేవరకొండ కుటుంబం తరఫున మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ అందరికీ ఎంతో ప్రేమను, ఆప్యాయ ఆలింగనాలను పంపిస్తున్నాం” అంటూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రష్మిక స్పెషల్ విషెస్.. క్యూట్ వీడియో

మరోవైపు రష్మిక మందన్న కూడా తన సోషల్ మీడియా ఖాతాలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "మా అందరి తరఫున మీ అందరికీ హ్యాపీ దీపావళి. మీరు చేసే చిన్న చిన్న పనుల్లోనూ, పెద్ద పెద్ద విషయాల్లోనూ ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడూ మంచి ఆరోగ్యం, అపారమైన సంతోషం, అంతులేని ప్రేమ లభించాలని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో అందమైన జ్ఞాపకాలను నింపాలి" అంటూ ప్రేమగా విషెస్ చెప్పారు. రష్మిక షేర్ చేసిన వీడియోతో పాటు విజయ్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఫ్యామిలీతో క్యూట్ మూమెంట్స్.. రొమాంటిక్ పిక్ వైరల్

ఈ దీపావళి ఫొటోల్లో విజయ్, రష్మిక జంటగా కనిపించిన క్యూట్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన క్షణాలు, జపాన్ అందమైన ప్రదేశాల్లో దిగిన ఫొటోలు, సన్నిహితంగా ఉన్న రొమాంటిక్ పిక్ ఫ్యాన్స్ను కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మిక మధ్య కనిపించిన ఆప్యాయత, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోల్లోని క్యూట్ స్మైల్ నెటిజన్లను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.  ఇలా విజయ్ ఫ్యామిలీ అంతా కలిసి ఒకేచోట దీపావళి జరుపుకోవడం కూడా ఈ ఫొటోలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. 

'విరోష్' అభిమానులకు పండగే..

విజయ్, రష్మిక షేర్ చేసిన ఈ ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలైంది. ముఖ్యంగా 'విరోష్' (Virosh) ఫ్యాన్స్ ఈ జంట ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఫారెన్ లో ఉన్నా మన సంప్రదాయాలను కొనసాగించడం బాగుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి ఇంత అందంగా దీపావళి జరుపుకోవడం చూడటానికి ఆనందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

►ALSO READ | Sharwanand Bhogi : శర్వానంద్ 'భోగి'కి సెన్సార్ షాక్.. నవంబర్ 12న రిలీజ్ కష్టమేనా?

ఇక విజయ్, రష్మిక రొమాంటిక్ ఫొటోను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని, మరిన్ని అందమైన మూమెంట్స్ అభిమానులతో పంచుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ జంట దీపావళి ఫొటోలు మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

సినిమాలతో బిజీగా విజయ్, రష్మిక

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'లో ఈ జంట కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రౌడీ జనార్ధన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రష్మిక మందన్న 'మైసా', 'రాకా' వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు కుటుంబంతో కలిసి జపాన్‌లో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. తమ ఫొటోలతో అభిమానులకు మరోసారి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.