Sharwanand Bhogi : శర్వానంద్ 'భోగి'కి సెన్సార్ షాక్.. నవంబర్ 12న రిలీజ్ కష్టమేనా?

Sharwanand Bhogi : శర్వానంద్ 'భోగి'కి సెన్సార్ షాక్.. నవంబర్ 12న రిలీజ్ కష్టమేనా?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ' భోగి '.  ఇప్పటికే ఈ చిత్రంపై సినీ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. డింపుల్ హయతి మరో కీలక పాత్రలో కనిపించనుంది. నవంబర్ 12న థియేటర్లలోకి ఎంట్రీ కావాల్సిన ఈ మూవీ నుంచి వచ్చిన ఈ సడెన్ షాక్ అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది.

సెన్సార్ బోర్డు రూపంలో ఈ చిత్రం రిలీజ్ కు ఊహించని బ్రేక్ పడింది. అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకుని, ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రానికి చివరి నిమిషంలో ఇలా షాక్ తగలడం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఏర్పాట్లు చేసింది. అయితే అనూహ్యంగా ట్రైలర్, ఈవెంట్ వాయిదా పడటంతో అభిమానుల్లో సినీ ఇండస్ట్రీలో మొదలయ్యాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ను తీవ్రనిరాశ నెలకొంది. అయితే ఈ సినిమా వాయిదాపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఇంకా అధికారప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో శర్వానంద్ గతంలో ఎన్నడూ కనిపించని రఫ్ అండ్ రస్టిక్ అవతార్ లో కనిపిస్తుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 1960 కాలం నాటి ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగునుంది. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులు, గ్రామీణ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేలా దర్శకుడు ఈ సినిమాను రూపొందించినట్లు తెలస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ఈ మూవీలో ఆడుకాలం నరేన్, రోహిత్ పాఠక్, రవి వర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. మరి రివైజింగ్ కమిటీ నుంచి 'భోగి'కి ఎలాంటి క్లియరెన్స్ వస్తుంది? ఈసారి శర్వానంద్ బాక్సాఫీస్ బరిలో ఎప్పుడు దిగుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు..