అభివృద్ది పేరుతో యూనివర్శిటి పచ్చదనం నాశనం చేయొద్దు.. చెట్టు నరికివేత ఆపేయాలని డిమాండ్

అభివృద్ది పేరుతో యూనివర్శిటి  పచ్చదనం నాశనం చేయొద్దు.. చెట్టు నరికివేత ఆపేయాలని డిమాండ్

కరీంనగర్  శాతవాహన యూనివర్సిటీలో అక్రమ తవ్వకాలు, చెట్ల నరికివేతపై విద్యార్థుల ఆందోళన చేపట్టారు.  అభివృద్ధి పనుల పేరుతో రెండు ఎకరాల్లో భారీగా తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు.  పది అడుగులకు పైగా లోతులో తవ్వకాలు చేసి మట్టి తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు.చెట్ల నరికివేతతో పర్యావరణం, పక్షుల సహజ ఆవాసాలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అభివృద్ధి పేరుతో యూనివర్సిటీ పచ్చదనాన్ని నాశనం చేయవద్దని విద్యార్థుల డిమాండ్ చేశారు

చెట్లు నరికివేత వలన  నెమళ్లు, ఇతర పక్షుల సంచారం తగ్గిపోయిందని  జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులకు  విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తవ్వకాలు, మట్టి తరలింపు, చెట్ల నరికివేతకు అనుమతులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  అధికారులకు విజ్ఞప్తి చేశారు.