జగిత్యాల బాలుడి దత్తత కథ సుఖాంతం..అధికారికంగా దత్తత ప్రక్రియను ముగించిన ఆఫీసర్లు

జగిత్యాల బాలుడి దత్తత కథ సుఖాంతం..అధికారికంగా దత్తత ప్రక్రియను ముగించిన ఆఫీసర్లు
  •     డీడబ్ల్యూవో తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ అసహనం
  •     కోర్టు కేసు, పోలీసు కేసు వెనక్కి తీసుకుంటామన్న కలెక్టర్‌‌‌‌

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాలకు చెందిన చిన్నారి రుద్ర మానేశ్‌‌‌‌ దత్తత కథ సుఖాంతమైంది. ఇటీవల బాలుడి ఏడుస్తున్న వీడియో వైరల్ కావడం, హైకోర్టు ఆదేశాల మేరకు పెంపుడు తల్లిదండ్రులైన శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌-, సరితకు బాలుడిని అప్పగించడం, ఆ మరుసటి రోజే సీడబ్ల్యూసీ, కలెక్టర్ హైకర్టులో స్టే పిటిషన్ వేయటం తెలిసిందే. ఈ వ్యవహారం లో కలెక్టర్ ను, ఇతర ఆఫీసర్లను పక్కదారి పట్టించిన డీడబ్ల్యూవో భాస్కర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌  ఫోన్‌‌‌‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయమై కలెక్టర్‌‌‌‌తోనూ తన అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు బాలుడి తల్లిదండ్రులు నిజామాబాద్‌‌‌‌లోని లక్ష్మణ్‌‌‌‌ - సుమలతను పిలిపించి రిజిస్ట్రేషన్‌‌‌‌ ఆఫీసులో శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌-, సరిత దంపతులకు అధికారికంగా రుద్రమానేశ్‌‌‌‌ దత్తత ప్రక్రియను పూర్తి చేశారు. 

వివాదాస్పదంగా డీడబ్ల్యూవో తీరు 

బాలుడి వ్యవహారంలో డీడబ్ల్యూవో భాస్కర్‌‌‌‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు విషయంలో కలెక్టర్‌‌‌‌ను, ఇతర ఆఫీసర్లను తప్పుదోవ పట్టించారని శ్రీనివాస్‌‌‌‌ అడ్వోకేట్‌‌‌‌ రఘునందర్‌‌‌‌ రెడ్డి ఆరోపించారు. బాలుడు లక్ష్మణ్‌‌‌‌, సుమలత దంపతులకే జన్మించాడని మున్సిపాలిటీ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉన్నా, కన్నవారిపై, పెంచిన వారిపై పోలీస్ కేసు పెట్టించడం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుపట్టారు. డిప్యూటేషన్ ముగిసి రెండు నెలలైనా భాస్కర్ జిల్లాను వదలకపోవడం, ట్రెజరీకి రూ.2 కోట్ల బిల్లులు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కేసులు వెనక్కి తీసుకుంటాం 
రుద్ర మానేశ్‌‌‌‌ విషయంలో హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌‌‌‌ పిటిషన్ ను ఉపసంహరించుకుంటాం. జగిత్యాల పీఎస్‌‌‌‌లో బాబు కన్నవారిపై, దత్తత తీసుకున్న వారిపై నమోదైన క్రిమినల్‌‌‌‌ కేసును కూడా వెనక్కి తీసుకుంటాం. ఈ మేరకు డాక్యుమెంటేషన్‌‌‌‌ ప్రక్రియ ప్రారంభించాం.
– సత్యప్రసాద్, కలెక్టర్‌‌‌‌