గోల్డ్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. వచ్చే 6 నెలల్లో రేట్లు పెరగొచ్చు..!

గోల్డ్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. వచ్చే 6 నెలల్లో రేట్లు పెరగొచ్చు..!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు వచ్చే 6–12 నెలల్లో మరింత పెరిగే అవకాశముందని మోతీలాల్‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ రిపోర్ట్​ అంచనా వేసింది. దీని ప్రకారం..పది గ్రాముల బంగారం ధర రూ.1.60 లక్షల నుంచి రూ.1.68 లక్షల స్థాయికి చేరవచ్చు. స్వల్పకాలంలో రూ.1.48 లక్షల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.  

ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పెట్టుబడుల డిమాండ్‌‌‌‌ కొనసాగుతోంది. సెప్టెంబర్‌‌‌‌లో భారత్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌‌‌‌ల్లోకి రూ.4,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆగస్టుతో పోలిస్తే 71 శాతం ఎక్కువ. ధరలు తగ్గినప్పుడు దశలవారీగా కొనడం మంచిది. అయితే శుక్రవారం బంగారం రిటైల్​ ధర రూ.2,500 తగ్గి రూ.1.46 లక్షలకు చేరింది.