అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెడీతో.. చంద్రయాన్

అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెడీతో.. చంద్రయాన్

దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో  రూపొందిన  తాజా చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు.  శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో  ప్రవీణ్ మొలక నిర్మించారు.  

శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ప్రపంచంలో తమ ఊరికి,  ఆ ఊర్లో తమకు గుర్తింపు కోసం నలుగురు కుర్రాళ్లు గూగుల్ సాయంతో రాకెట్ తయారు చేసి చంద్రుడి పైకి వెళ్లాలనుకుంటారు. ఇంధనం కోసం తవుడు తీసుకురావడాన్ని బట్టి వాళ్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్మెంట్‌‌‌‌‌‌‌‌ ఏ రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉంటుందో అంచనా వేయొచ్చు. 

కానీ వీళ్ల ప్రయోగాలు ఊరికి అరిష్టంగా భావిస్తారు గ్రామస్థులు. మరోవైపు ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. ఇన్ని సమస్యల మధ్య చంద్రయాన్ ప్రయోగం ఎలా సాగింది అనేది మిగతా కథ. నవంబర్ 13న  సినిమా విడుదల కానుంది.