54వ అంతర్జాతియ ఎమ్మీ అవార్డుల వేడుకలో విజయ్ సేతుపతి

54వ అంతర్జాతియ ఎమ్మీ అవార్డుల వేడుకలో విజయ్ సేతుపతి

కోలీవుడ్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఆయన ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించబోతున్నారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23న  న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును ప్రదానం చేయబోతున్న ఫస్ట్ ఇండియన్‌‌‌‌‌‌‌‌ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌ సేతుపతి కావడం విశేషం. 

రెండేళ్ల క్రితం భారతీయ నటుడు, కమెడియన్‌‌‌‌‌‌‌‌ వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ ఈ వేదికపై హోస్ట్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించగా,  ఇప్పుడు విజయ్ సేతుపతి ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించబోతున్నారు. పదేళ్ల క్రితం ప్రియాంక చోప్రా ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుల వేదికపై ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించినప్పటికీ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై ఈ గౌరవం దక్కడం ఇదే ప్రథమం.  

ఇక ఆయన లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన ‘బత్తా’ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చి సూపర్ హిట్‌‌‌‌‌‌‌‌ టాక్‌‌‌‌‌‌‌‌తో స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ అవుతోంది.  మరోవైపు ఆయన రెండేళ్ల క్రితం నటించిన సూపర్ హిట్ మూవీ ‘మహారాజ’ ఇప్పుడు హాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో రీమేక్ అవుతోంది.