ఉలగనాయగన్ కమల్ హాసన్ మరోసారి తనదైన స్టైల్‌లో అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. వరుస సినిమాలు, ప్రయోగాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ లెజెండరీ నటుడు ఇప్పుడు ఓ పవర్‌ఫుల్ యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'చిత్తా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేతులు కలిపారు. లేటెస్ట్ గాఈ చిత్రానికి 'సండియర్' (Sandiyar) అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే ఫ్యాన్స్ కు మేకర్స్ ఈ అదిరిపోయే క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్ రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో తుపాకీ పట్టుకొని, రక్తపు మరకలున్న కారు దగ్గర నిలబడిన ఆయన లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదని, ప్రతీకారం నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథ అని అర్థమవుతోంది. 'Revenge can only be settled in BLOOD' అనే ట్యాగ్‌లైన్ అంచనాలను మరింత పెంచుతోంది.
'చిత్తా'తో సిద్ధార్థ్‌కు మంచి విజయాన్ని అందించిన అరుణ్ కుమార్, ఆ తర్వాత విక్రమ్‌తో 'వీర ధీర శూరన్'తెరకెక్కించారు. ఇప్పుడు కమల్ హాసన్‌తో ఆయన చేస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సహజమైన కథనానికి, బలమైన పాత్రల చిత్రణకు పేరున్న అరుణ్ కుమార్.. కమల్‌ను ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాను కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ చేపట్టారు. సినిమాటోగ్రఫీని సునీల్ కేఎస్ నిర్వహిస్తుండగా, సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2004లో కమల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విరుమాండి' సినిమాకు తొలుత 'సండియర్' అనే టైటిల్‌నే పెట్టారు. కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో ఆ పేరును మార్చారు. ఇప్పుడు అదే పేరుతో మరో కొత్త సినిమా రావడం విశేషం. అయితే ఈ సినిమా కథ, ఇతర నటీనటులు, విడుదల తేదీ వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. మరి ఈసారి కమల్ హాసన్ 'సండియర్'గా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి..
SANDIYAR சண்டியர் 🔥 #KamalHaasan #SUArunkumar #Sandiyar #சண்டியர் #SandiyarSambavam #HappyBirthdayKamalHaasan #HBDKamalHaasan #CelebratingKamalHaasan @ikamalhaasan #Mahendran @anirudhofficial @anbariv #SunilKS @amritharam2 #CSBalachandar @AKunjamma @RohanShrestha @RKFI @turmericmediaTM @magizhmandram @APIfilms @homescreenent
— Raaj Kamal Films International (@RKFI) November 6, 2026
