కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో మంచి జోరు మీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు ‘సీన్’ మూవీతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేశారు. మలయాళ దర్శకుడు జీతు మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోనూ ఇవాళ (నవంబర్ 6, 2026న) సినిమా షోలు ప్రారంభమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో #Scene, #Suriya హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా? లేదా? అనేది ట్విట్టర్ టాక్లో తెలుసుకుందాం..
SCENE కథేంటి?
ఈ సినిమాలో సూర్య ఇన్బరాజ్ (Inbaraj) అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒకప్పుడు పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొన్ని కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. అయితే గతంలో ఆయన పరిష్కరించకుండా వదిలేసిన ఒక కేసు మళ్లీ తెరపైకి వస్తుంది. దీంతో ఆ కేసును ఛేదించాల్సిన బాధ్యత తిరిగి ఇన్బరాజ్‌పై పడుతుంది. ఈసారి ఆయనకు సహకరించేందుకు ఒక సాధారణ పోలీస్ టీమ్ కాకుండా.. విచిత్రమైన వ్యక్తిత్వాలు, వింత ఆలోచనలు ఉన్న కొంతమంది వ్యక్తులు తోడవుతారు. వాళ్లందరినీ ఒక టీమ్‌గా నడిపించడం ఇన్బరాజ్‌కు పెద్ద సవాలుగా మారుతుంది. మరోవైపు నస్లెన్ పోషించిన ఈశ్వరన్ (Eeswaran) పాత్ర కథలో కీలకమైన విలన్‌గా కనిపిస్తుంది. అతడికి, ఇన్బరాజ్‌కు మధ్య జరిగే పోరాటం కథలో ఉత్కంఠను పెంచుతుంది. మొత్తంగా, ఒక పాత కేసు.. దాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన వింత టీమ్.. వాళ్లకు ఎదురయ్యే ప్రమాదకరమైన నేరస్థుడు.. ఈ నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లరే ‘సీన్’.
పబ్లిక్ టాక్ ఇదే..
‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి సినిమాలతో తనదైన మార్క్ చూపించిన జీతు మాధవన్.. ఈసారి సూర్యను డిఫరెంట్ అవతార్‌లో చూపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సూర్య, నజ్రియా, నస్లెన్ కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానుల పోస్టులు చూస్తుంటే.. సూర్య పాత ఫామ్ తిరిగి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సైకో క్యారెక్టర్ చేసిన ప్రేమలు హీరో నస్లెన్‌తో సూర్య స్క్రీన్ షేరింగ్, సుషిన్ శ్యామ్ మ్యూజిక్, జీతు మాధవన్ మార్క్ కామెడీ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
#SCENE First Half Review 🍿 - A Fresh Crime Comedy Entertainer so far with an Engaging Screenplay..✌️ - An Interesting choice of script from a Big Star like #Suriya..🔥 His Role..🤝 #Naslen's Characterization was..⭐ - The Film maintains the Lighthearted humour tone throughout with a Crime angle.. - The Surprise Cameo and the twist reveal and the setup after that was engaging..👍 - The Stage is set well for the Second half.. Waiting for the Inbaraj vs Eeswaran Faceoff..🤝 Onto the Second half now..✌️
— Laxmi Kanth (@iammoviebuff007) November 6, 2026
ఓవరాల్ గా ఫస్టాఫ్‌లో సూర్య మాస్ సీన్స్, నస్లెన్ సైకో క్యారెక్టరైజేషన్, ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్స్‌గా నిలుస్తాయని ఆడియన్స్ అంటున్నారు. సెకండాఫ్‌లో నస్లెన్ పాత్ర మరింత ఆసక్తికరంగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ అంశాలను దర్శకుడు జీతు మాధవన్ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించినట్లు ఆడియన్స్ ఫస్ట్ రివ్యూలు చెబుతున్నాయి..
