మామునూరు విమానాశ్రయంతో ప్రాంతీయ అభివృద్ధి: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్

మామునూరు విమానాశ్రయంతో ప్రాంతీయ అభివృద్ధి: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్

ఖిలా వరంగల్, వెలుగు : మామునూరు విమానాశ్రయాన్ని గురువారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామునూరు విమానాశ్రయం వరంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష అని అన్నారు. 

తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్‌‌‌‌తో పాటు పరిసర జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్‌‌‌‌ సత్యశారద మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన వివరాలను కమిషన్‌‌‌‌ సభ్యుడికి వివరించారు. 

విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న వారిలో ఎస్సీలు 55 మంది, ఎస్టీలు ఒకరు, బీసీలు 214 మంది, ఓసీలు 60 మంది ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నిఖిత, గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ వెంకన్న, అడిషనల్​ కలెక్టర్‌‌‌‌ ఎల్‌‌‌‌.కిషోర్‌‌‌‌కుమార్‌‌‌‌, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ అధికారి నటరాజ్‌‌‌‌, వివిధ శాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.