మళ్లీ ఫోన్ల ధరలకు రెక్కలు... బడ్జెట్‌‌‌‌ ఫోన్ల రేట్లు 30శాతం పెరిగే చాన్స్...మెమరీ చిప్స్ కొరతే కారణం

మళ్లీ ఫోన్ల ధరలకు రెక్కలు... బడ్జెట్‌‌‌‌ ఫోన్ల రేట్లు 30శాతం పెరిగే చాన్స్...మెమరీ చిప్స్ కొరతే కారణం

న్యూఢిల్లీ: స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ కొనాలనుకుంటున్నారా? అయితే కొంతకాలం వేచి చూడటం కంటే ఇప్పుడే కొనడం మంచిదేమో! ఏఐ రంగంలో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు మొబైల్‌‌‌‌ ఫోన్ల ధరలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే స్మార్ట్‌‌‌‌ఫోన్ల ధరలు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని జెఫరీస్‌‌‌‌ నివేదిక హెచ్చరించింది. ఏఐ కంపెనీలు భారీగా మెమరీ చిప్‌‌‌‌లను కొంటుండటంతో వాటి సరఫరా తగ్గుతోంది. 

2027లో మెమరీ చిప్‌‌‌‌ల డిమాండ్‌‌‌‌లో ఏఐ సంస్థల వాటా 60 శాతానికి చేరవచ్చని అంచనా. ఈ రంగంలోని కంపెనీలు అదే ఏడాది సుమారు 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. దీంతో మెమరీ ధరలు మరికొన్ని త్రైమాసికాల పాటు అధిక స్థాయిలో ఉండొచ్చు. 

2025లో ఒక్కో యూనిట్‌‌‌‌ మెమరీ వ్యయం 20 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం 65 డాలర్లకు పెరిగింది. 200 డాలర్లలోపు ధర కలిగిన ఆండ్రాయిడ్‌‌‌‌ ఫోన్ల తయారీ వ్యయంలో మెమరీ చిప్‌‌‌‌ల వాటా సుమారు 60 శాతం. అందుకే ఈ విభాగంపై ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ప్రపంచ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో తక్కువ ధర ఫోన్ల వాటా 2025లో 42 శాతంగా ఉండగా, 2026లో 24 శాతానికి పడిపోవచ్చని అంచనా.