నన్ను అభిశంసిస్తే మీ పార్టీ సర్వనాశనమే..డెమోక్రాట్లకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

నన్ను అభిశంసిస్తే  మీ పార్టీ సర్వనాశనమే..డెమోక్రాట్లకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

వాషింగ్టన్​ డీసీ: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం తర్వాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌‌‌‌లో డెమోక్రాట్లు తనను అభిశంసించే ప్రయత్నం చేస్తే, అది ఆ పార్టీనే సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీ పరాజయం చవిచూసిన మరుసటి రోజు.. భవిష్యత్తులో రాబోయే అభిశంసన గురించి మీడియా ప్రశ్నించగా ట్రంప్ ఈమేరకు స్పందించారు. ఒకవేళ వారు ఆ పనిచేస్తే అది డెమోక్రాట్ పార్టీని పూర్తిగా నాశనం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. తనను అభిశంసించడానికి అసలు ఎటువంటి కారణమే లేదని ట్రంప్ తెలిపారు.