టెహ్రాన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తగలడంతో ట్రంప్ సర్కారు మారుతుందని భావించడం పొరపాటే అవుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. అదేసమయంలో అమెరికా గనుక ఇరాన్‌పై మళ్లీ దాడులుచేస్తే యుద్ధం మరింత విస్తృతం అవుతుందని హెచ్చరించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. ఇరాన్ యుద్ధం కారణంగా ట్రంప్ మద్దతుదారులు సైతం డెమోక్రాట్లవైపు మల్లడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు, అమెరికన్ల ఆర్థిక ఇబ్బందులకు ట్రంప్, ఆయన ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధమే కారణమని డెమోక్రాట్ అభ్యర్థులు తీవ్రంగా విమర్శించారు.
