వచ్చే ఏడాది నుంచే ‘క్లైమేట్ చేంజ్’పై బీఏ కోర్సు: టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

వచ్చే ఏడాది నుంచే ‘క్లైమేట్ చేంజ్’పై బీఏ కోర్సు: టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: వాతావరణ సమస్యల పరిష్కారంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘బీఏ క్లైమేట్ చేంజ్, సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్‌‌మెంటల్ గవర్నెన్స్’ పేరుతో డిగ్రీ కోర్సు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

దేశంలోనే ఈ తరహా వినూత్న కోర్సును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన ‘6వ ఎడిషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఫర్ క్లైమేట్ యాక్షన్’ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్ర సదస్సు సన్నాహక కార్యక్రమంగా ఉన్నత విద్యామండలి, కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.