ఒకే వేదికపై కేటీఆర్, జగన్, CM విజయ్.. వైఎస్ అనిల్ కూతురు పెళ్లిలో రేర్ సీన్

ఒకే వేదికపై కేటీఆర్, జగన్, CM విజయ్.. వైఎస్ అనిల్ కూతురు పెళ్లిలో రేర్ సీన్

చెన్నై: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహం తమిళనాడు రాజధాని చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్ జగన్ ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మలతో కలిసి హాజరయ్యారు. అలాగే, తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, వైఎస్ షర్మిల కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. 

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‎గా విజయ్, జగన్, కేటీఆర్ త్రయం

వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సీఎం విజయ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికను పంచుకున్నారు. స్టేజ్‏పై నూతన వధూవరులతో ముగ్గురు కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అంతకుముందు ఒకరినొకరు ఆప్యాయంగా పలరించుకున్నారు. జగన్, కేటీఆర్, విజయ్ ఒకరినొకరు పలకరించుకోవడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చిన విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి. 

టీవీకే, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఫొటోలను తెగా వైరల్ చేస్తున్నారు. జగన్, కేటీఆర్, విజయ్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా వీరు ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పెళ్లిలో మరో హైలెట్ ఏంటంటే.. నటి త్రిష సీఎం విజయ్‎తో కలిసి  హాజరయ్యారు. త్రిష, విజయ్ బంధంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ ఈ ఇద్దరు కలిసి పెళ్లికి రావడంతో వీరి రిలేషన్‎ స్టేటస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.