హైదరాబాద్లో నకిలీ గోధుమ పిండి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్లో నకిలీ గోధుమ పిండి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ గోధుమ పిండి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు 2026 నవంబర్ 5న పట్టుకున్నారు. కొత్త పాత బ్రాండ్లతో గోధుమ పిండి తయారు చేయడమే కాకుండా బస్తాల కొంది కుల్లా పిండిని సిటీలో అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 

కుత్బుల్లాపూర్  పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో ఇల్లీగల్ గోధుమపిండి గోదాంపై పోలీసులు దాడిచేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సివిల్ సప్లై గోధుమలను 51 సంచులను సీజ్ చేశారు. 

ఈ కల్తీ ముఠాలో కీలక వ్యక్తి అయిన సుభాష్ నగర్ కు చెందిన రమేష్ అగర్వాల్(40) ను అరెస్టు చేశారు. అక్రమంగా పంజాబ్ రేషన్ గోధుమలను తెచ్చి  పలు బ్రాండ్స్ కవర్ లలో ఫ్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. 

హైదరాబాద్ వేదికగా నకిలీ గోధుమపిండి సప్లై చేస్తూ  లక్షల బిజినెస్ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు.