హైడ్రా కమిషనర్తో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ట్యాంకర్ల అసోసియేషన్

హైడ్రా కమిషనర్తో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ట్యాంకర్ల అసోసియేషన్

ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్ సభ్యులు సమ్మె విరమించారు. 2026 నవంబర్ 4న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో యధావిధిగా నీటి సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు.  

నగరంలో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగకుండా హైడ్రా సూచనలు చేసింది. తక్కువ జనసాంద్రత కలిగిన PURE ప్రాంతాల నుంచి నీటి సేకరణ చేయాలని సూచించింది. అవసరమైన అనుమతులు తీసుకుని బోర్ల నుంచి నీటి సేకరణకు అంగీకారం తెలిపారు. 

PURE ప్రాంతాల నుంచి నీటిని సేకరించి సరఫరా చేసేందుకు ట్యాంకర్ల యజమానుల అంగీకరించారు. సమ్మె విరమించి తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరణకు ట్యాంకర్ల యజమానుల నిర్ణయించారు. 

మరోవైపు హైదరాబాద్‌లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణపై హాస్టళ్ల నిర్వాహకులు, వ్యాపారులు  హర్షం వ్యక్తం చేశారు. ట్యాంకర్ల సమ్మె విరమణతో హాస్టళ్లకు నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతోంది. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన హైడ్రాకు హాస్టళ్ల నిర్వాహకుల అభినందనలు తెలిపారు. 

అంతకు ముందు హాస్టళ్ల నిర్వాహకుల సంఘం ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి సమస్యను వివరించారు. ట్యాంకర్ల యజమానులతో చర్చించి సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌కు విద్య, ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తుంటారు. నగరంలోని హాస్టళ్లు, పీజీల్లో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటారు. 
నీటి అవసరాల కోసం ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరాపైనే హాస్టళ్ల ఆధారపడుతుంటాయి. ట్యాంకర్ల సమ్మె కొనసాగితే హాస్టళ్లలో ఉంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హైడ్రా కమిషనర్ కు విన్నవించారు.