'ఛలో', 'భీష్మ' లాంటి హిట్స్ అందించిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా తన లక్ పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన స్వంత బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున గ్రాండ్‌గా ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ లవ్ డ్రామా 'ఇట్లు అర్జున'. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాతో అనీష్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్న భామ అనశ్వరా రాజన్ కథానాయికగా నటించింది. లవ్, యాక్షన్, మదర్ ఎమోషన్స్ కలగలిపిన ఈ ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో విజువల్ ఫీస్ట్ ఖాయమనిపిస్తోంది.
ఈ కథలోని అసలైన క్రేజీ ట్విస్ట్ ఏమిటంటే.. హీరో మాట్లాడలేని ఒక మూగ వ్యక్తి. అలాంటి ఒక అమాయక కుర్రాడిని రౌడీ మూకలతో పాటు పోలీస్ ఆఫీసర్లు కూడా ఎందుకు వెంటాడుతున్నారు? అతని వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? తాను ప్రేమించిన అమ్మాయి కూడా ఈ ప్రమాదంలో ఎలా చిక్కుకుంది? వారిద్దరూ కలిసి ఈ చక్రవ్యూహం నుండి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తికరమైన సస్పెన్స్ చుట్టూ సినిమా నడవనుంది.
తొలిసారి హీరో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనీష్ తన ఎమోషనల్ యాక్టింగ్, స్టంట్స్‌తో అదరగొట్టగా, అనశ్వరా రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్ మేజిక్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన పాటలు ఈ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ 'ఇట్లు అర్జున' బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
