SKN to Radhika Apte: ‘అక్క’ వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత SKN తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే.. దక్షిణాది చిత్ర పరిశ్రమను, ఇక్కడి సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడే వారికి గట్టిగానే బదులిచ్చారు. ఇంతకీ SKN ఏమన్నారు? రాధికా ఆప్టే వ్యాఖ్యల వెనుక ఉన్న వివాదమేంటి? అన్నది తెలుసుకుందాం..
ఎడాపెడా ఇచ్చిపడేసిన SKN..
రాధికా ఆప్టే వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న సమయంలో బేబీ మూవీ ప్రొడ్యూసర్ SKN చేసిన (ఎక్స్) పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దక్షిణాది సినిమాల్లో నటించి, ఇక్కడే అవకాశాలు, గుర్తింపు సంపాదించుకున్న కొందరు నటీనటులు.. ఆ తర్వాత అదే ఇండస్ట్రీపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
నిన్ను గౌరవించిన ఇండస్ట్రీని గౌరవించు..
SKN తన పోస్ట్‌లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. అయితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అదే పరిశ్రమ కథలు, సంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నటుడికీ తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే నిర్మాణాత్మక విమర్శలకు, ఒక పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడటానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. తెలుగు సినిమాకు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, కథా విలువలు ఉన్నాయని గుర్తుచేశారు.
►ALSO READ | Sreeleela: సూపర్‌స్టార్ రజనీతో శ్రీలీల.. తమిళంలో వరుస అవకాశాలు..
ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులకు వింతగా అనిపించే అంశాలు.. మరో ప్రాంతం సంస్కృతిలో సాధారణమైనవి కావచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. ముఖ్యంగా.. అవకాశాలు ఇచ్చిన పరిశ్రమను, ఆ పరిశ్రమ వెనుక ఉన్న సంస్కృతిని తర్వాత అవమానించడం సరికాదని హితవు పలికారు. నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ ఎంపిక చేసుకుని విమర్శించడం, సాంస్కృతిక ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
Accepting roles, working in South Indian cinema, gaining recognition and opportunities here, and then years later criticising the same industry, its stories and cultural traditions is becoming an unfortunate pattern. Every actor has the right to express an opinion. But there is a difference between constructive criticism and selectively looking down upon an industry that welcomed you. #Telugucinema and #SouthIndian cinema have their own cultural identity, traditions and storytelling values. What may seem unusual to someone from another region can be perfectly normal within our culture. Respect should be mutual. You cannot celebrate the opportunities and later disrespect the culture behind them. Constructive criticism is always welcome. Selective criticism and cultural superiority are not. Respect the industry that respected you.
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 4, 2026
రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పరోక్ష కౌంటరేనా?
SKN తన పోస్ట్‌లో రాధికా ఆప్టే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలే టాలీవుడ్‌లో చర్చకు కారణం కావడంతో.. SKN పోస్ట్‌ను ఆమెకు పరోక్ష కౌంటర్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా కథ నచ్చకపోతే విమర్శించే హక్కు నటీనటులకు ఉంటుందని కొందరు అంటుంటే.. ఒక సినిమా అనుభవం ఆధారంగా మొత్తం పరిశ్రమ సంస్కృతిని తప్పుబట్టడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు SKN ఘాటు పోస్ట్‌తో మరింత ఆసక్తికరంగా మారింది. బాలయ్య అభిమానుల ఆగ్రహం, నిర్మాత SKN రియాక్షన్ తో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.
అసలు వివాదం ఎలా మొదలైంది?
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కెరీర్ స్టార్టింగ్ లో ‘రక్త చరిత్ర’, ‘ధోని’, బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘లయన్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. తాజాగా ‘అక్క’ వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకంటే చాలా పెద్ద వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం, మేనమామను పెళ్లి చేసుకునే పాత పితృస్వామ్య సన్నివేశాల్లో నటించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు. అంతేకాదు, సినిమాలో తన పాత్ర చనిపోయిన తర్వాత హీరో తన మృతదేహాన్ని భుజాన వేసుకుని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటారని గుర్తుచేసుకున్నారు. ఆమె నేరుగా సినిమా పేరు చెప్పకపోయినా.. ఈ వివరాలు బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాకు సరిపోవడంతో వివాదం మొదలైంది.
Radhika Apte has opened up about her experience working in Telugu cinema, revealing that she was asked to marry her own cousin in a film. She also spoke about being paired opposite a much older actor and how her character was killed off halfway through the movie. The film in question is Legend (2014), starring Nandamuri Balakrishna. But if she had a problem with the storyline or romancing an older actor, wouldn't she have known about the script and the hero before signing the film? She agreed to do the movie back then, yet is raising these issues years later while calling out patriarchy in the industry.
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) November 2, 2026
బాలయ్య ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట చర్చ..
రాధికా వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కథ నచ్చకపోతే అప్పుడే ఎందుకు అంగీకరించారని ప్రశ్నిస్తున్నారు. ‘లెజెండ్’ తర్వాత కూడా బాలకృష్ణతో ‘లయన్’ సినిమాలో నటించడాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే మరోవైపు.. గతంలో ఎదురైన అనుభవాలపై మాట్లాడే హక్కు నటీనటులకు ఉందని కొందరు సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు, వయసు అంతరాలు, పితృస్వామ్య ధోరణులపై కూడా చర్చ మొదలైంది. మరి ఈ ఇస్స్యూపై బాలయ్య గానీ, లెజండ్ మూవీ డైరెక్టర్ బోయపాటి గానీ స్పందిస్తారా? లేదా అనేది ఆసక్తిగా మారింది.
