CNG సిలిండర్ పై స్కూల్ పిల్లలను కూర్చోబెట్టిన ఆటోవాలా : ఎంత డేంజరో అర్థం అవుతుందా వీడికి..!

CNG సిలిండర్ పై స్కూల్ పిల్లలను కూర్చోబెట్టిన ఆటోవాలా : ఎంత డేంజరో అర్థం అవుతుందా వీడికి..!

ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు.. కానీ మన నిర్లక్ష్యమే కొన్నిసార్లు వాటికి కారణమవుతుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, మరెంతోమంది జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా బాధ్యతారాహిత్యం మారడం లేదు. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి అద్దం పట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్ చిన్నారులను ఆటోలో సురక్షితంగా కూర్చోబెట్టాల్సింది పోయి.. ఏకంగా సీఎన్‌జీ గ్యాస్ సిలిండర్‌పై కూర్చోబెట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిర్లక్ష్యం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చిన్నారులను క్షేమంగా బడికి చేర్చాల్సిన బాధ్యతను విస్మరిస్తే.. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలకు తీరని విషాదమే మిగులుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే.. జరగకుండా జాగ్రత్త పడటం ముఖ్యం కదా!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా జహ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులను పరిమితికి మించి ఓ ఆటోలో  ఎక్కించి తరలిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్‌లో సరిపడా సీట్లు లేకపోవడంతో కొందరు చిన్నారులు సీఎన్‌జీ గ్యాస్ సిలిండర్‌పై, దాని చుట్టూ కూర్చొని ప్రయాణించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించాయి.

వీడియో వైరల్ కావడంతో బులంద్‌షహర్ పోలీసులు స్పందించారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఆటోను స్వాధీనం చేశారు.  మరోవైపు ఈ ఘటనతో జిల్లావ్యాప్తంగా పాఠశాల వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేయాలని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు అక్కడి యంత్రాంగం ఆదేశించింది.  చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు నెటిజన్లనుంచి వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా జహ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులను పరిమితికి మించి ఓ ఆటోలో ఎక్కించి తరలిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.