సిక్స్ ఫీట్ హైట్ అంటే యూత్ లో మస్త్ క్రేజ్. అమ్మాయిలు అయితే బాగా ఇష్టపడుతుంటారని అంటుంటారు. ప్రభాస్ అంత హైట్, మహేష్ బాబు అంత ఎత్తు ఉండాలి అంటూ అమ్మాయిలు రీల్స్ మన తెలుగు స్టేట్స్ లో వైరల్ అయ్యాయి కూడా. ఆరు అడుగులు ఓకే.. కానీ అంతకు మించిన ఎత్తు ఉంటే.. ఆ హైట్ కు తగ్గట్లుగా వెయిట్ ఉంటే.. వాళ్ల ఇబ్బందులు ఎలా ఉంటాయో ఫన్నీ వీడియో వైరల్ గా మారింది.
ఎయిర్ ఇండియా విమానంలోని వాష్‌రూమ్‌లో 6 ఫీట్ల 8 ఇంచుల ఎత్తున్న ఒక వ్యక్తి ఇబ్బందిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామెంట్స్, ఫన్నీ రిప్లైలతో పాటు ఒక సీరియస్ డిస్కషన్ కూడా నడిచింది. అదేంటో చూద్దాం.
ట్రావెల్ కపుల్ రేమండ్, రమీసా (@rayandramisa) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ రీల్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో ఆ ఎత్తున్న వ్యక్తి వాష్‌రూమ్ తలుపు లోపలికి వెళ్లడానికి బాగా కష్టపడాల్సి వచ్చింది. సాధారణ వ్యక్తి కోసం ఏర్పాటు చేసిన వాష్ రూమ్ లో నిలువునా, అడ్డంగా భారీగా ఎదిగిన వ్యక్తి వెళ్తే.. ఎంతలా వంగాల్సి వస్తుందో, భుజాలు ఎలా మెలిపెట్టాల్సి వస్తుందో వీడియోలో చూడవచ్చు.
వాష్ రూమ్ అంటే సాధారణంగా, కంఫర్ట్ గా ఉండాలి. కానీ అతడికి మాత్రం పూర్తిస్థాయి వ్యాయామంలా మారింది. ఎత్తైన ప్యాసెంజర్లు ఎదుర్కొనే ఇబ్బందులను హాస్యంగా చూపించే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో వల్ల విమానాల్లోని వాష్‌రూమ్ సైజులు, ఎత్తు, బరువు ఉన్న ఉన్న ప్రయాణికుల ఆవస్థలపై చర్చ మొదలైంది.
ఇండియన్ నెటిజన్స్ ఫైర్:
ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎత్తుగా ఉన్న ప్రయాణికులకు సరిపడా వాష్ రూమ్స్ నిర్మించలేక పోయింది అన్నట్లుగా సెటైరికల్ గా ఉన్న వీడియోపై ఇండియన్ నెటిజన్స్ ఫైరయ్యారు. ఎయిర్ ఇండియా విమానాలు తయారు చేయదు. బోయింగ్ లేదా ఎయిర్‌బస్ తయారు చేసిన విమానాలనే ఉపయోగిస్తుంది. ప్రపంచంలోని ఇతర ఎయిర్‌లైన్స్ కూడా అవే వాడుతున్నాయి అంటూ చాలామంది కామెంట్ చేశారు.
►ALSO READ | అగ్నివీర్ సర్వీస్ కాలం మరో రెండేళ్లు పొడగింపు..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ఎయిర్ ఇండియా విమానాలు తయారు చేయదు. అవి ఇతర ఎయిర్‌లైన్స్ ఉపయోగించే అదే విమానాలు. మీ భర్త ఎత్తుతో పాటు చాలా లావుగా కూడా ఉన్నారు. ఇండియాపై ద్వేషం చూపించకుండా మరో ఎయిర్‌లైన్‌లో ప్రయాణించండి.. అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఎడ్యుకేషన్ ఎందుకు ముఖ్యమో ఈ వీడియో చెబుతుంది. ఎయిర్ ఇండియా విమానాలు తయారు చేయదు. సరిగ్గా చదువుకుని ఉంటే విషయం తెలిసేది. భారత్ పై ద్వేషం చూపించే ప్రయత్నంలో వీళ్ల మనస్తత్వం ఏంటో బయటపడిందని మరొకరు రిప్లై ఇచ్చారు.
