భారత్ vs న్యూజిలాండ్ తొలి వన్డే.. పిచ్ రిపోర్ట్, రేపటి వెదర్ రిపోర్ట్ ఇదే!

భారత్ vs న్యూజిలాండ్ తొలి వన్డే.. పిచ్ రిపోర్ట్, రేపటి వెదర్ రిపోర్ట్ ఇదే!

IND vs NZ 1st ODI: టీ20 సిరీస్‌ను 3–2 తేడాతో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియా, ఇప్పుడు అసలు సిసలైన వన్డే పోరుకు సమాయత్తమైంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రేపు (2026, నవంబర్ 4, బుధవారం) తొలి వన్డే జరగనుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఇండియన్ టీమ్ కు సారథ్యం వహిస్తుండగా, కివీస్ జట్టును మిచెల్ శాంట్నర్ నడిపించనున్నాడు. అయితే తొలి మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఎంత వరకు ఉంది? పిచ్ ఎలా ఉండబోతోంది? అన్న అంశాలనింటిని ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం.. 

ఆక్లాండ్‌లో వర్షం.. మ్యాచ్ జరుగుతుందా?:

క్రికెట్ ప్రేమికులకు కాస్త ఊరటనిచ్చే ముచ్చట ఏంటంటే.. ఈ మ్యాచ్‌కు వాతావరణం దాదాపు అనుకూలించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆక్యూ వెదర్ (AccuWeather) నివేదిక ప్రకారం ఆక్లాండ్‌లో ఉదయం పూట వర్షం కురిసే అవకాశం 56 శాతంగా ఉంది.  ఇక స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు) మ్యాచ్ ప్రారంభం కానుంది.  ఆ సమయానికి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి మ్యాచ్‌కు పెద్దగా అంతరాయం కలగకపోవచ్చు.. ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నాయి.   

పిచ్ రిపోర్ట్: 

* ఈడెన్ పార్క్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇరు జట్లు ఇక్కడ భారీగా పరుగులు చేసే ఛాన్స్ ఉంది. 

* చిన్న బౌండరీలు: ఈ మైదానంలో బౌండరీలు చాలా చిన్నవి కావడంతో బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 

* స్వింగ్ ఎఫెక్ట్: కొత్త బంతితో మొదటి కొన్ని ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు కొంచెం స్వింగ్ లభించినప్పటికీ, ఓవరాల్‌గా ఇది హై-స్కోరింగ్ మ్యాచ్ (High-scoring match) అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

* హిస్టారికల్ రికార్డ్: 2026, సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన నాలుగో టీ20 మ్యాచులో ఇదే ఈడెన్ పార్క్ మైదానంలో న్యూజిలాండ్ టీమిండియాపై భారీ విజయం సాధించింది. అప్పట్లో కివీస్ 259/7 స్కోరు చేయగా, భారత్‌ను 172 పరుగులకే ఆలౌట్ చేసి 87 పరుగుల తేడాతో గెలుపొందింది. మరీ చూడాలి ఆ మ్యాచ్ కి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో.