బెంగళూరులో కొత్త పేరుతో మ్యూజిక్ హంగామా.. ఇకపై ‘ఎయిర్‌టెల్ ఎరీనా’.. డిస్ట్రిక్ట్‌తో కీలక ఒప్పందం!

 బెంగళూరులో కొత్త పేరుతో మ్యూజిక్ హంగామా.. ఇకపై ‘ఎయిర్‌టెల్ ఎరీనా’.. డిస్ట్రిక్ట్‌తో  కీలక ఒప్పందం!

భారతదేశంలో లైవ్ షోలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, ఇతర వినోద కార్యక్రమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు డిస్ట్రిక్ట్ (District), ఎయిర్‌టెల్ చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలు ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా బెంగళూరులోని 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్ వేదిక పేరును 'ఎయిర్‌టెల్ ఎరీనా'గా మార్చనున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రేక్షకులకు అందించే అనుభవాలను డిస్ట్రిక్ట్ సంస్థ చూసుకుంటుంది. మరోవైపు ఎయిర్‌టెల్ ఈ వేదికలో ప్రత్యేక డిజిటల్ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పెట్టుబడి పెడుతుంది.

ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవం
ఈ ఒప్పందం కేవలం వేదిక పేరు మార్చడానికి మాత్రమే కాదు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే కార్యక్రమాల్లో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సేవలు అందించడమే ముఖ్య లక్ష్యం.

ప్రస్తుతం మ్యూజిక్ కాన్సర్ట్‌లు, లైవ్ షోలకు వెళ్లే ప్రేక్షకులు వారికీ  నచ్చిన పాటలను వీడియోలుగా రికార్డ్ చేయడం, లైవ్‌లో షేర్ చేయడం, ఫొటోలు పంపించడం, ఆన్‌లైన్ పేమెంట్లు  చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సమయంలో నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ సమస్యను తగ్గించేందుకు ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా అధిక సామర్థ్యం కలిగిన డిజిటల్ నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వేల మంది ఒకేసారి వేదికకు వచ్చినా వేగవంతమైన ఇంటర్నెట్, నమ్మకమైన మొబైల్ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు.

ఆన్‌లైన్ చెల్లింపులు, ఇతర సదుపాయాలు కూడా
ఈ వేదికలో ఇప్పటికే మొబైల్ ద్వారా ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే క్యాష్  అవసరం లేకుండా డిజిటల్ పద్ధతుల్లో డబ్బులు చెల్లించే అవకాశం కూడా కల్పించారు.

ఇప్పుడు ఎయిర్‌టెల్ అందించే కొత్త డిజిటల్ సదుపాయాలతో ఈ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. రాబోయే ఈవెంట్ సీజన్ ప్రారంభమయ్యేలోపు మరిన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థలు భావిస్తున్నాయి.

భారతీయ వినోద రంగంలో కొత్త మార్పు
ఇప్పటివరకు విదేశాల్లోని ప్రముఖ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికల్లో ఇలాంటి ప్రత్యేక డిజిటల్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భారత్‌లోనూ అలాంటి వ్యవస్థను తీసుకురావడానికి డిస్ట్రిక్ట్, ఎయిర్‌టెల్ కలిసి పనిచేస్తున్నాయి.

ఈ భాగస్వామ్యంతో ప్రేక్షకులకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంతో పాటు, కళాకారులు, ఈవెంట్ నిర్వాహకులకు కూడా కార్యక్రమాలను సులభంగా నిర్వహించే అవకాశం కలుగుతుంది. మొత్తంగా లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచడమే ఈ రెండు సంస్థల లక్ష్యం.