ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఫస్ట్ లవర్ కు బ్రేకప్ చెప్పి.. కొత్త లవర్ తో ప్రేమలో పడింది యువతి. కొత్తోడితో లవ్ లో పడింది అంటే ఫస్ట్ లవర్ వద్దన్నట్లే కదా! కొత్త లవర్ ను చంపాలనుకున్న మాజీ లవర్ కు సహకరించింది. క్రైమ్ సినిమాను తలపిస్తున్న ఈ స్టోరీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచనలంగా మారింది. కేరళలో జరిగిన ఈ లవ్-క్రైమ్ కు సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం.
పదిహేడేళ్ల వయసు టీనేజర్లు.. అంటే టెన్త్ లేదా ఇంటర్ చదివే చిన్నతనం. పుస్తకాలతో భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాల్సిన వయసులో.. గంజాయి, డ్రగ్స్, మారణాయుధాలతో రక్త చరిత్ర రాస్తున్నారు. దేశ వ్యాప్తంగా రేపటి తరం ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించే ఘటన ఇది. వీళ్లేంది.. ఈ వయసులో ఈ దుర్మార్గాలేంటి..? అని సమాజం ఆందోళన చెందే పరిస్థితి.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీకార్యంలో ఒక 17 ఏళ్ల కుర్రాడిని మరో టీనేజర్ హత్య చేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. రిలేషన్షిప్స్ పేరుతో ఏర్పడిన వివాదం.. హత్యకు దారితీసింది. ఈ స్టోరీలో ట్విస్టులు సినిమా కథలను పోలినట్లు ఉండటం గమనార్హం. ఈ కేసులో ఇద్దరు అరెస్టయ్యారు. ఒక అమ్మాయిని విచారణకు తీసుకున్నారు.
మృతుడి పేరు అభిరామ్ (17). 2026 నవంబర్ 1 (ఆదివారం) సాయంత్రం తప్పిపోయాడు. తర్వాత అతని మృతదేహం ఒక సంచిలో ఉంచి, ఆకులతో కప్పి, జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతంలోని డ్రెయిన్ దగ్గర పడేశారు నిందితులు.
ఏం జరిగింది?
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం, ఈ హత్యకు కారణం రిలేషన్షిప్స్ గొడవ. నిందితుడు, అతని మాజీ ప్రేయసి, ఆమె కొత్త ప్రియుడు (అభిరామ్ స్నేహితుడు) మధ్య జరిగిన వివాదం దీనికి దారితీసింది.
నిందితుడు తన ప్రస్తుత ప్రేయసి ఇన్స్టాగ్రామ్ ఐడీతో అభిరామ్‌తో చాట్ చేశాడు. తనను కలవాలని ఆ అమ్మాయిలా చాట్ చేసి అట్రాక్ట్ చేశాడు. ఒక చోటుకి రావాలని చెప్పడంతో అభిరామ్ ఆ స్థలానికి వెళ్లాడు. అయితే అక్కడ అమ్మాయికి బదులు ఆమె మాజీ లవర్ ఉండటం చూసి అభిరామ్ షాకయ్యాడు.
ALSO READ : ఏం ప్లాన్ రా నీది.. కాపాడండి అంటూ షాపులోకి వచ్చి..
ఆ అమ్మాయి కొత్త లవర్ ను అంటే అభిరామ్ స్నేహితుడిని పిలిపించాలని అభిరామ్‌ను నిందితుడు (ఆమె పాత లవర్) బలవంత పెట్టాడు. అయితే తన ఫ్రెండ్ రాకపోవడంతో అభిరామ్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించాడు. దీంతో అమ్మాయి కొత్త లవర్ పై ఉన్న కోపాన్ని అభిరామ్ పై చూపించాడు. రాయితో తలపై కొట్టి, గొంతు పట్టి పిసికి హత్య చేశాడు. తర్వాత ఉమర్ (22) సహాయంతో మృతదేహాన్ని సంచిలో ఉంచి డ్రెయిన్ దగ్గర పారవేశారు.
ప్రేయసి ప్లాన్..
పోలీసులు ప్రధాన నిందితుడు (17 ఏళ్ల టీనేజర్), 22 ఏళ్ల ఉమర్‌ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు నిందితుడి ప్రస్తుత ప్రేయసిని (ఐటీఐ విద్యార్థిని) కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఐడీని ఇచ్చి, ఆ తర్వాత ఆధారాలు నాశనం చేయాలని సలహా ఇచ్చినట్లు విచారణలో తేలింది.
అభిరామ్ తండ్రి మధు మాట్లాడుతూ .. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తన కొడుకుతో మాట్లాడినట్లు చెప్పారు. రెండో కాల్‌కు లిఫ్ట్ చేశాడు. ఊపిరి పీలుస్తున్నట్టు అనిపించింది. పది నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పాడు. బహుశా తప్పించుకునే ప్రయత్నిస్తూ నా కాల్‌కు సమాధానం ఇచ్చి ఉంటాడు అని చెప్పారు.
రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో 9 గంటలకు పోలీసులను సంప్రదించారు అభిరామ్ తండ్రి. ఫ్రెండ్ తో ఒక అమ్మాయిని కలవడానికి వెళ్లినట్లు తెలిసింది. ఆమెను పోలీసులు విచారించినప్పుడు ఫోన్ ప్రధాన నిందితుడి వద్ద ఉందని చెప్పిందని తండ్రి ఆరోపించారు.
త్రివేండ్రం సిటీ పోలీస్ కమిషనర్ డా. అరుల్ ఆర్.బి. కృష్ణ మాట్లాడుతూ రాత్రి 11.30 గంటలకు ఫిర్యాదు వచ్చింది. 2.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. అప్పటికి మిస్సింగ్ కేసు. జువెనైల్‌ను కస్టడీలో ఉంచలేమని చెప్పారు.
ఇది కరెక్టేనా..?
ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. యువతి మాజీ లవర్ ను కాదని మరో టీనేజర్ తో లవ్ లో పడింది. అంటే ఫస్ట్ లవర్ వద్దనట్లే కదా. కానీ ఫస్ట్ లవర్ కు ఫోన్ ఎందుకు ఇచ్చింది. కొత్త లవర్ ను చంపేందుకు ఎందుకు సహకరించింది..? ఆమె ఇన్ స్టా ద్వారా కొత్త లవర్ ను ఒక చోటికి పిలిచేందుకు తన ఫోన్ మాజీ లవర్ కు ఎందుకు ఇచ్చింది..? ఫస్టోడు వద్దని.. కొత్తోడితో లవ్ లో ఉంటూ.. మళ్లీ ఫస్ట్ లవర్ తో ఏంటి సంబంధం.. వీడిని చంపేందుకు వాడికి సహకరించడం ఏంటి..? ఇది లవ్వా లేక శాడిజమా..? అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మీరేమంటారు..?
