దొంగల ప్లానింగ్ చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది.. కొన్ని ప్లాన్లు చూస్తే జాలి కూడా వేస్తుంది. ఈ దొంగ రెండో రకానికి చెందినవాడు. నన్ను చంపేయటానికి వస్తున్నారు.. కాపాడండి అంటూ షాపులోకి వచ్చిన దొంగ.. తను వచ్చిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. స్థానికులు పట్టుకొని తుప్పురేగ కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులో 2026 అక్టోబర్ 31న జరిగింది ఈ ఘటన. ఇందిరా నగర్ లోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఒక షాపులోకి వచ్చిన ప్రభురాజ్ అనే వ్యక్తి (40).. అక్కడ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న మహిళ మెడలో ఉన్న మంగళసూత్రం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి దొరికి పోయాడు. చైన్ విలువ నాలుగున్నర లక్షల విలువ ఉంటుందని చెబుతున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉదయం 11.45 ప్రాంతంలో హెల్మెట్, గ్లోవ్స్ ధరించిన ఒక వ్యక్తి కాపాడండి అంటూ షాపులోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే రిసెప్షన్ కౌంటర్ లోకి దూకి.. నన్ను చంపడానికి వస్తున్నారు.. అరవద్దు అని రిసెప్షనిస్టు దాక్కున్నాడు. ఆమె గట్టిగా అరిచే ప్రయత్నం చేయగా.. అరవద్దు అని ఆమెను బలవంతంగా కూర్చోబెట్టాడు.
చేతులను ఫెవిక్విక్ తో బంధించి..
ఆ తర్వాత వెంటనే ఆమె నోరు మూసేసి.. మెడపై కత్తి పెట్టాడు. గోల్డ్ చైన్ ఇస్తావా చస్తావా అంటూ బెదిరించాడు. అరిస్తే మెడ తెగిపోతుందని భయపెట్టాడు. దీంతో ఆమె చావు భయంతో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత రెండు చేతులను ఫెవిక్విక్ తో బంధించి అంతికించేశాడు. అక్కడే ఉన్న గుడ్డముక్కను నోట్లో కుక్కాడు. ఆమె మెడకు ఉన్న 35 గ్రాముల పుస్తెల తాడును గుంజి జేబులో వేసుకున్నాడు.
యువతి చాకచక్యం:
పుస్తెల తాడుతో పారిపోయే ప్రయత్నం చేస్తున్న దొంగను చాకచక్యంగా ఆ యువతి నిలువరించింది. అతి కష్టం మీద చేతులు విప్పదీసుకుని గట్టిగా అరుస్తూ ఆ దొంగను పట్టుకుంది. దీంతో షాపు బయట ఉన్న కస్టమర్లు అలర్ట్ అయ్యారు. అయితే వెంటనే దొంగ ఆమె జుట్టు పట్టుకుని.. మెడపై కత్తిపెట్టి.. బయటికి ఈడ్చుకొచ్చాడు. ఎవరైన అడ్డుకోవాలని చూస్తే పీక తెగుతుందని బెదిరించాడు.
ధైర్యం చేసి షాప్ ఓనర్, అక్కడున్న పబ్లిక్ పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఓనర్ పైన కత్తితో దాడి చేశాడు. పారిపోయాడు.
ALSO READ : మలక్ పేటలో దొంగల ముఠా గుట్టురట్టు..
సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో దొంగను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. అయితే ఆ దొంగకు మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
🚨SHOCKING | Man identified as Prabhuraj held a woman at knifepoint and threatened to kill her during a chain-snatching attempt in Bengaluru's Indiranagar; he even glued her hands to a table using Fevikwik https://t.co/pvld6FnNWs
— The Tatva (@thetatvaindia) November 3, 2026
