17 మంది చిన్నారుల అదృశ్యం.. అర్జున్ దాస్ 'జాన్ డో' ట్రైలర్ చూస్తే వణుకుపుట్టాల్సిందే!

17 మంది చిన్నారుల అదృశ్యం.. అర్జున్ దాస్ 'జాన్ డో' ట్రైలర్ చూస్తే వణుకుపుట్టాల్సిందే!

కోలీవుడ్ లో విలక్షణమైన గొంతు, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అర్జున్ దాస్. 'ఖైదీ', 'మాస్టర్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ  హీరో ఇప్పుడు మరో ఆసక్తికరమైన మూవీతో రెడీ అయ్యారు. మధుమిత దర్శకత్వంలో 'జాన్ డో' అనే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌తో థ్రిల్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే మిస్సింగ్ కేసుల వెనుక ఎంతటి భయంకరమైన నేర సామ్రాజ్యం దాగి ఉందో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ చిన్నారి అదృశ్యమైన కేసును అర్జున్ దాస్ విచారించాల్సి వస్తుంది. మొదట సాధారణ మిస్సింగ్ గా కేసుగా కనిపిస్తుంది. విచారణ వ్యవహారం ముందుకు సాగే కొద్ది ఊహించిన మలుపులు తిరుగుతుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది చిన్నారులు మిస్సింగ్ , వరుస హత్యల వెనుక ఉన్న భయంకరమైన నెట్ వర్క్ బయటపడే సూచనలు ట్రైలర్ లో చూపించారు. అసలు ఈ చిన్నారులను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్నది ఎవరు? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.  

ALSO READ : బాలీవుడ్ తుషార్ కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. 

ఈ  'జాన్ డో' ట్రైలర్ ను రిలీజ్ చేసిన సందర్భంగా సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెంచాయి. సస్పెన్స్ , భయం, ఉత్కంఠతో సాగిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.  జారా వినీత్, సంచనా నటరాజన్, సృష్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మధుమిత , నికోలస్ చెవాలియన్ కలిసి స్క్రీన్ ప్లే రూపొందించారు. ఈ చిత్రానికి ముజీబ్ మజీద్ సంగీతం అందించారు.  నవంబర్ 13న ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి అర్జున్ దాస్ 'జాన్ డో'  బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.