AP Muncipal Elections Results: నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మాయాజాలం: కూటమి హవాను తట్టుకుని గెలిచిన YCP

AP Muncipal Elections Results: నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మాయాజాలం: కూటమి హవాను తట్టుకుని గెలిచిన YCP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్. రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ హవా నడిస్తే.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం వైసీపీ హవా నడిచింది. రాష్ట్రం మొత్తం కూటమి మెజార్టీ స్థానాల్లో దూసుకెళుతుంటే.. నందికొట్కూరులో మాత్రం కూటమి చతికిలపడింది.

దీనికి కారణం ఏంటా అంటే.. నందికొట్కూరులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ముందుండి నిలబడటమే.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నందికొట్కూరు మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టిన బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి.. మున్సిపాలిటీలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

వైసీపీ యూత్ కేడర్లో బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఈ గెలుపుతో మరోసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం నడిచింది. మొత్తం నందికొట్కూరు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గానూ 23 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు జెండా ఎగరేశారు. దీంతో.. నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ వశమైంది.