అమరావతి: చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా చీరాలలో ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 2026, నవంబర్ 6వ తేదీన చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తుఫాన్ వర్షాల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 3) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే, మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవడంతో పలు చోట్ల కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుంది. ప్రతిపక్ష వైసీపీ నందికొట్కూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన పులివెందుల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతోంది. పులివెందుల మున్సిపాలిటీలో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటి కౌంటింగ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీ కంచుకోట అయినా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటిలో టీడీపీ విజయం సాధించింది.
.
