Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో రేపటి (2026, నవంబర్ 4, బుధవారం) నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 32, 101, 92 పరుగులతో (ఓవరాల్‌గా 225 పరుగులు, 75 యావరేజ్) అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్, ఇప్పుడు కివీస్ గడ్డపై సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హిట్ మ్యాన్ సాధించబోయే 5 చారిత్రాత్మక మైలురాళ్లు ఇవే..
SENA దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా ఆల్-టైమ్ రికార్డ్:
విదేశీ గడ్డపై రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు కేవలం 36 పరుగుల దూరంలో ఉన్నాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఒక ఓపెనర్‌గా 5,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మొదటి టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ నిలవనున్నాడు. ఇప్పటి వరకు SENA కంట్రీస్‌లో 114 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 44.32 యావరేజ్‌తో 4,964 రన్స్ (17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు) సాధించాడు.
SENA దేశాలన్నింటిలో వన్డే సెంచరీ.. ఎలైట్ క్లబ్‌లోకి:
న్యూజిలాండ్ నేలపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులు సాధించినప్పటికీ (4 హాఫ్ సెంచరీలు), ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ ఒక్క సెంచరీ బాదినా.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) అనే నాలుగు దేశాల్లోనూ వన్డే సెంచరీలు చేసిన టీమిండియా బ్యాటర్ల సరసన చేరుతాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మాత్రమే ఈ అరుదైన ఫీట్ సాధించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 21,000 పరుగుల మైలురాయి:
అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 21,000 అంతర్జాతీయ పరుగులను పూర్తి చేసుకోవడానికి మరో 348 రన్స్ దూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు 517 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 42.66 యావరేజ్‌తో 20,652 పరుగులు (52 సెంచరీలు, 113 హాఫ్ సెంచరీలు) సాధించాడు.
ALSO READ : న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ XI చూస్తే షాకే?
విజయాల్లో 15,000 రన్స్.. సచిన్, కోహ్లీ సరసన:
భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకమైంది. టీమిండియా గెలిచిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ ఇప్పటి వరకు 14,817 పరుగులు (42 శతకాలు) బాదేశాడు. ఈ సిరీస్‌లో ఇండియన్ టీమ్ గెలిచే మ్యాచ్‌లలో మరో 183 పరుగులు సాధిస్తే, గెలిచిన మ్యాచ్‌ల్లో 15,000+ పరుగులు సాధించిన రికీ పాంటింగ్ (20,140), విరాట్ కోహ్లీ (18,589), సచిన్ టెండూల్కర్ (17,113)ల ఎలైట్ క్లబ్‌లో 4వ ప్లేయర్‌గా రోహిత్ చేరతాడు.
వన్డేల్లో 400 సిక్సర్ల విధ్వంసానికి చేరువలో:
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఖాతాలో ప్రస్తుతం 381 సిక్సర్లు కొట్టాడు. వన్డేల్లో 400 సిక్సర్ల మార్కును అందుకోవడానికి రోహిత్‌కు మరో 19 సిక్సర్లు మాత్రమే కావాల్సి ఉంది. మరో 26 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 700 సిక్సర్లు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంటాడు హిట్ మ్యాన్.
