పుణెలో 8వేల 300 కోట్లతో నిర్మించిన పుణె మూడో మెట్రో లైన్(పింక్‌లైన్) ను ప్రధాని మోదీ మంగళవారం ఉదయం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతోపాటు 21వేల 800 కోట్లతో ఫుణె మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ పింక్‌లైన్ సుమారు 23 కిలోమీటర్ల పొడవుతో పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మితమైంది. ఇది పుణెలోని ఐటీ హబ్ హింజేవాడి (మాన్) నుంచి శివాజీనగర్ లోని జిల్లా కోర్టు మెట్రో స్టేషన్ వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. సాధారణ ప్రయాణికుల కోసం రేపటినుంచి అంటే నవంబర్ 4, 2026 ఉదయం 6 గంటల నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ కారిడార్‌లో మొత్తం 23 స్టేషన్లు ఉండగా, మొదటి దశలో 17 స్టేషన్లను ప్రయాణికుల కోసం తెరుస్తున్నారు. మిగిలిన 6 స్టేషన్లను 2027 జనవరి నాటికి దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నాయి.
పింక్‌లైన్ ప్రత్యేకత ..
ఈ పింక్ లైన్ లో ప్రత్యేకత ఏంటంటే.. మెట్రో రైళ్లను పూర్తిగా మహిళా ఆపరేటర్లు నడపడం. దీంతోపాటు ఈ మెట్రో లైన్ విద్యుత్ అవసరాలలో 30 శాతం వరకు సౌర శక్తి (సోలార్ పవర్) తో రైళ్లు నడుస్తాయి. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ కింద డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్' (DBFOT) విధానంలో నిర్మించిన భారతదేశపు తొలి మెట్రో ప్రాజెక్టులలో ఒకటి.
