India vs Pakistan: ప్రపంచ క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరుకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) మ్యాచ్‌ల టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అక్టోబర్ 10, 2027న జోహ్యాన్స్ బర్గ్ లోని 'ది వాండరర్స్' స్టేడియం వేదికగా జరగనున్న ఇండియా vs పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఒక్కదానికే ఏకంగా 84 లక్షల (8.4 Million) టికెట్ అప్లికేషన్లు వచ్చినట్లు నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.
స్టేడియం సీటింగ్ 34 వేలే.. రిక్వెస్ట్‌లు మాత్రం కోట్లలో:
ది వాండరర్స్ మైదానం సీటింగ్ సామర్థ్యం కేవలం 34,000 మాత్రమే.. కానీ మ్యాచ్ చూడటానికి ఏకంగా 84 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం నిర్వాహకులను సైతం తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంతేకాకుండా, ఇదే వేదికపై జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం దాదాపు 80 లక్షల (8 Million) టికెట్ రిక్వెస్ట్‌లు వచ్చాయి.
193 దేశాల నుంచి 12 కోట్లకు పైగా అప్లికేషన్లు:
* మొత్తం టికెట్ డిమాండ్: 14 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి 193 దేశాల నుంచి 30 లక్షల మందికి పైగా క్రికెట్ అభిమానులు ఏకంగా 12 కోట్లకు పైగా (120 Million) టికెట్ దరఖాస్తులు చేసుకున్నారు.
* డెడ్‌లైన్: నవంబర్ 21 వరకు టికెట్ బ్యాలెట్ (Ballot Window) ప్రక్రియ తెరిచే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
* టోర్నీ వ్యవధి: 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ఈ వన్డే మెగా టోర్నమెంట్ జరగనుంది.
