గోళ్లు అందంగా, బలంగా పెరగాలా.. కాస్ట్లీ నెయిల్ పాలిష్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

గోళ్లు అందంగా, బలంగా పెరగాలా..  కాస్ట్లీ నెయిల్ పాలిష్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే  చాలు!

గోళ్లు అందంగా లేకపోతే ఎంత కలర్ ఫుల్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా.. ఎంత గ్రాండ్ నెయిల్ ఆర్ట్ దిద్దినా లుక్ రాదు. అందుకే చేతిగోళ్లు బలహీనంగా ఉన్నా, మృదుత్వాన్ని కోల్పోయినా జాగ్రత్తపడాల్సిందే. గోళ్ల అనారోగ్యానికి కొన్ని సార్లు మనం తెలిసీ తేలియక చేసే పొరపాట్లు, మన డైలీ హ్యాబిట్స్ కూడా కారణమే. అందుకే అవేంటో తెలుసుకుని గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

తడి లేకుండా తుడుచుకోవాలి
ఇంటి పనుల్లో ముఖ్యంగా క్లీనింగ్ టైంలో రబ్బర్ గ్లోవ్స్ ఉపయోగించాలి. నీళ్లని గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే పోర్స్ త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన వెంటనే తడి లేకుండా తుడుచుకోవాలి. అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతులను సబ్బు లేదా లిక్విడ్ తో  శుభ్రపరుచుకున్నాక గోళ్లు పొడిబారినట్టుగా అనిపిస్తే లోషన్ తో  మసాజ్ చేసుకోవాలి.

 రిమూవర్స్ వద్దు
ఎక్కువ సార్లు గోళ్ల రంగులను మార్చిమార్చి వేయకూడదు. ఎసిటోన్ బేస్డ్ నెయిల్ రిమూవర్స్ కి దూరంగా ఉండాలి. ఇవి గోళ్ల ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. గోళ్ల పెరుగుదలని అడ్డుకుంటాయి. అలాగే గోళ్లని డబ్బా మూతలు తీయడానికి ఉపయోగించకూడదు.

దృష్టిపెట్టాలి
క్యుటికల్స్ ఆరోగ్యం పైనే గోళ్ల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అందుకే అందమైన గోళ్లు కావాలనుకునే వాళ్లు ముందు క్యుటికల్స్ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ఆయిల్స్, సీరమ్స్ క్యుటికల్స్ ని తరచూ మసాజ్ చేస్తుండాలి. వీటివల్ల గోళ్ల దగ్గర రక్తప్రసరణ బాగా జరిగి బలంగా, పొడవుగా పెరుగుతాయి.. గోళ్లు విరగడం ఆగుతుంది.