అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం కొందరు బ్యూటీపార్లర్స్కి 'క్యూ' కడితే.. మరికొందరు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు. ఇంకొందరైతే సర్జరీలు కూడా చేయించుకుంటారు. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి వాళ్లకోసమే ఈ ఫేస్ యోగా. ముఖంపై ముడతలు, ఫేస్ ప్యాట్ ఉన్న వాళ్లు ఈ యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖాకృతి అందంగా మారుతుంది. చర్మం గ్లో వస్తుంది కూడా. అంతేకాదు, ఈ ఆసనాల వల్ల ఒత్తిడి నుంచి కూడా బయటపడొచ్చు. కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
1. మత్స్యాసనం
వజ్రాసనంలో కూర్చొని ఒక నిమిషం పాటు. కళ్లు మూసుకోవాలి. మూతిని ఫొటోలో చూపిన ట్టుగా చేప నోటిలా పెట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు రావాలి. కాసేపు నోరు తెరిచి ఉంచాలి. ఇలా ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కు వసార్లు చేయాలి.
2. నుదుటి వ్యాయామం
కనుబొమలను వీలైనంత పైకి లేపి చూపుడు, బొటన వేళ్లతో ఫొటోలో చూపినట్టు పట్టుకోవాలి. పది అంకెలు లెక్క పెట్టి తర్వాత కనుబొమలను కిందకు కదిలించాలి. ఇలా కొంచెం విరామంతో ఐదారుసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల సుదుటి కండరాలు, నాడులు చురుగ్గా పనిచే స్తాయి. మాడు మొదలు నుదుటి వరకు ఉన్న భాగమంతా రిలాక్స్ అవుతుంది.
3. బుగ్గలతో
వజ్రాసనంలో కూర్చోవాలి. బుగ్గల నిండా గాలి నింపుకుని బెలూన్ చేసి ఆ తరువాత నెమ్మ దిగా గాలి బయటకు వదలాలి. తర్వాత వేళ్లతో ముఖాన్ని మసాజ్ చేయాలి. మళ్లీ బుగ్గల నిండా గాలి నింపుకుని పైన చెప్పినట్టు మళ్లీ ఒకసారి చేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత మెడ, గడ్డం భాగాన్ని వేళ్లతో మసాజ్ చేయాలి.
4. నుదురుతో
రెండుకళ్లను మూసుకోవాలి. ఫొటోలో ఉన్నట్టు ముఖం కదలకుండా రెండు చేతులతో నుదుటి నుంచి తల వరకు పట్టుకోవాలి. ఈ పొజిషన్లో పది సెకన్లు ఉండాలి.
5. ఓం అంటూ
వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత రెండు ఆర చేతులను చెంపలకి రెండువైపులా ఫొటోలో చూ పించినట్టు ఉంచి వాటి సాయంతో బుగ్గలని పైకి ఎత్తాలి. తరువాత నెమ్మదిగా నోరుతెరిచి 'ఓం' అని పదిసార్లు పలకాలి. ఇలా రోజుకి ఐదారు సార్లు చేస్తే చాలా మంచిది.
6. లాగాలి
ఈ ఆసనం కోసం యోగా మ్యాట్‌పై మోకాళ్ల మీద నిల్చోవాలి. తర్వాత రెండు మో చేతులను బల్లపీటపై ఫొటోలో చూపించినట్టుగా పెట్టి పిడికిలి బిగించాలి. ఇప్పుడు పిడికిలిలోంచి బొటన, చూపుడు వేళ్లను బయటకు తీసి రెండు పెదాలను గట్టిగా పట్టుకుని నేలవైపుకు లాగాలి.. ఈ పొజిషన్లో పది సెకన్లు ఉండాలి. ఇలా రోజుకి ఐదారుసార్లు చేయాలి.
►ALSO READ | దీపావళి పండుగ... క్రాకర్స్ ఫెస్టివల్.. సైన్స్ చెబుతున్న సైంటిఫిక్ రీజన్ ఇదే...
