ఏపీ మున్సిపల్ ఫలితాలు: కుప్పం కౌంటింగ్ కేంద్రం దగ్గర స్వల్ప ఉద్రిక్తత

ఏపీ మున్సిపల్ ఫలితాలు: కుప్పం కౌంటింగ్ కేంద్రం దగ్గర స్వల్ప ఉద్రిక్తత

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం కౌంటింగ్ కేంద్రం దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3, 7, 8 వార్డుల కౌంటింగ్‌పై వివాదం నెలకొంది. తమను బయటకు పంపించారని వైసీపీ ఏజెంట్లు ఆరోపించారు. కౌంటింగ్ సెంటర్లో అధికారులు టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కౌంటింగ్ కేంద్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా.. కుప్పంలోని 3, 7, 8 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న సమయంలో తమను కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారని వైసీపీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఆరోపించారు. ఈ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకే తమను ఉద్దేశపూర్వకంగా బయటకు పంపించారని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.