దోమల సీజన్ వచ్చేసింది. డెంగీ దాడి చేసే కాలం కూడా ఇదే. ఈ టైంలో దోమల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం అందరం. ముఖ్యంగా మార్కెట్లో దొరికే మస్కిటో కాయిల్స్, క్రీములు, మస్కిటో రిపెల్లెంట్ మ్యాట్స్, స్ప్రేలు వాడతాం. అయితే దోమల బెడద నుంచి కాపాడే రిపెల్లెంట్స్ మనుషుల్లోనూ రెస్పిరేటరీ సమస్యలకు కారణం అవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
మస్కిటో కాయిల్స్ ఎక్కువగా వాడితే కంటి సమస్యలతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. అయితే దోమల బెడద నుంచి బయటపడేందుకు కాయిల్స్ బదులుగా దోమతెరలు వాడటం, చుట్టుపక్క ప్రదేశాలు పొడిగా ఉండేలా చూసుకోవడం, నిల్వ నీరు ఉన్న పాత్రలపై మూతలు పెట్టటం చెయ్యాలి. దోమల బెడద నుంచి బయటపడేందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేని వేప నూనె లాంటివి వాడటం మంచిదట.
►ALSO READ | గోళ్లు అందంగా, బలంగా పెరగాలా.. కాస్ట్లీ నెయిల్ పాలిష్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
