మణికొండలో కాలువ మరమ్మతులు.. లక్షల లీటర్ల నీళ్లు రోడ్డు పాలు

మణికొండలో కాలువ మరమ్మతులు.. లక్షల లీటర్ల నీళ్లు రోడ్డు పాలు

హైదరాబాద్ మణికొండలో  కాండేట్ కాలువ రిపేరు కోసం లక్షల లీటర్ల నీళ్లు తోడేస్తూ రోడ్డు పాలు చేయడం విమర్శలకు దారితీసింది. కాలువ మరమ్మతుల పనుల్లో భాగంగా 2026 నవంబర్ 3న వాటర్ బోర్డు సిబ్బంది భారీ మోటార్లతో నీటిని తోడేశారు. పైపుల నుంచి పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చి రోడ్లపైన వాగులు పారినట్లుగా పారడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ఒకవైపు నీటి కొరతతో ప్రజల ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఇలా నీటి వృథా ఏంటని ప్రశ్నిస్తున్నారు. రిపేర్ల పేరుతో నీటిని వృథా చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు స్థానికులు  సూచించారు.  

ALSO READ : మురసు తుఫాన్ తీరం దాటింది.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. 

 వేరే పైపు లైన్ల ద్వారా సమీపంలో ఉన్న చెరువు కుంటలకు లేదా ట్యాంకులకు మళ్లిస్తే నీటిని ఆదా చేసినట్లు ఉండేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే ట్యాంకర్ల ద్వారా నీటి కొరత ఉన్న ఏరియాలకు పంపిణీ చేస్తే బాగుండేదని అంటున్నారు. ముందస్తు ప్లానింగ్ లేకుండా ఇంత కరువు పరిస్థితుల్లో నీటిని వృథా చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.