రాజీనామా అయిన చేస్తాగానీ.. క్షమాపణలు చెప్పను.. దలేర్మెహంది వివాదంపై ఉత్తరాఖండ్ మంత్రి 

రాజీనామా అయిన చేస్తాగానీ.. క్షమాపణలు చెప్పను.. దలేర్మెహంది వివాదంపై ఉత్తరాఖండ్ మంత్రి 

ప్రముఖ పంజాబి సింగర్​దలెర్ మెహందీ, ఉత్తరాఖండ్ మంత్రి సుభోద్ ఉనియాల్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదంలో మంత్రి క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్​ పెరగడంతో  మరింత వివాదాస్పదమైంది. అయితే  సింగర్​ దలేర్​ మెహందికి క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని, అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. 

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్‌లో పాల్గొన్న దలెర్ మెహందీపై మంత్రి ఉనియాల్​వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమంలో దలేర్​ తాగి స్టేజిపైకి వచ్చారని,ఉత్తరాఖండ్ పవిత్ర భూమిని అగౌరవ పర్చారని మంత్రి ఉనియాల్​ ఆరోపించారు.  అంతేకాదు లైవ్​ లో పాడకుండా లిప్​ సింగ్​ చేశారని కూడా అరోపించారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​కావడంతో  మంత్రి ఉనియాల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దలేర్​ కు మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వచ్చాయి. 

తనపై విమర్శలు రావడంతో మంత్రి ఉనియాల్​ స్పందించారు.  డెహ్రడూన్​ లో  మాట్లాడుతూ తన మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. అవసరమైతే పదవికి రాజీనామా అయినా చేస్తాగానీ, దలేర్​ కు క్షమాపణ చెప్పేది లేదని,ఆత్మగౌరవమే తనకు అన్నింటికన్నా ముఖ్యమని  ఉనియాల్​అన్నారు. 

అంతకుముందు ఈ వివాదంలో దలేర్​ మెహందీకి మంత్రి క్షమాపణ చెప్పాలని దలెర్ మెహందీ సోదరుడు, సింగర్​ మిక్కా సింగ్ తోపాటు, సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. దలెర్ మెహందీ ఇటీవల సర్జరీ చేయించుకున్నారని దీంతో  ఎక్కువ సేపు పాడే స్థితిలో లేరని, అయినప్పటికీ ముందే ఇచ్చిన కమిట్‌మెంట్ తో కార్యక్రమానికి హాజరయ్యారని మిక్కా వివరించారు. మెహందీ మద్యం సేవించరని కూడా మిక్కాసింగ్​ స్పష్టం చేశారు.

అయితే ఈ వివాదంలో ట్విస్ట్​ ఏంటంటే ఉనియాల్ ఫోన్‌లో మెహందీకి క్షమాపణ చెప్పారని  కొద్దిరోజుల క్రితం మిక్కా టీమ్ చెబుతోంది.కానీ మంత్రి తాజా వ్యాఖ్యలు ఆ వాదనను తిరస్కరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.