స్టేజీ మీదనే పాకిస్తానోడి చెంప చెల్లుమనిపించిన భారత్ బాక్సర్.. వీడియో వైరల్!

స్టేజీ మీదనే పాకిస్తానోడి చెంప చెల్లుమనిపించిన భారత్ బాక్సర్.. వీడియో వైరల్!

దుబాయ్‌ వేదికగా జరగబోయే బాక్సింగ్ ఫైట్ ప్రమోషన్లల్ల భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరగాండ్ల మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. సోషల్ మీడియాలో ‘హాఫ్ ఇంజనీర్’ (Half Engineer) అని మస్తు ఫేమస్ అయిన మన ఇండియన్ బాక్సర్ మనీష్ శర్మ, స్టేజీ మీదే పాకిస్తాన్‌కు చెందిన రహీమ్ పర్దేసి గాని దవడ పగిలేలా చెంపదెబ్బ కొట్టిండు. ఇద్దరి మధ్య ఫేస్-ఆఫ్ (Face-off) జరుగుతుండగా తిక్కరేగి కొట్టిన ఈ దెబ్బతో స్టేజీ అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.   

అడ్డమైన కూతలు కూసిన పాక్ బాక్సర్.. దెబ్బకు మైండ్ బ్లాక్: 

దుబాయ్‌ల పెట్టబోయే ఫ్యూరీ బై ది సీ (Fury by the Sea) MUKA బాక్సింగ్ ఈవెంట్ ప్రెస్ మీట్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్‌కు చెందిన రహీమ్ పర్దేసి.. మన మనీష్ శర్మను సూసి అడ్డగోలుగా తిడుతూ, సీన్ చేస్తూ కావాలనే రెచ్చగొట్టిండు. పాకిస్తానోడి పిచ్చి కూతలకు మనీష్ స్టేజీ మీదనే చెంప చెల్లుమనిపించిండు. దాంతో ఇద్దరూ కొట్లాటకు దిగగా, అక్కడున్న సెక్యూరిటీ వాళ్లు వెంటనే వచ్చి ఇద్దరినీ పక్కకు లాగేసి గొడవను సర్దిజెప్పారు.   

నవంబర్ 6న రింగులో అసలైన జాతర: 

రింగ్‌లోకి దిగకముందే ఇద్దరి మధ్య ఈ రేంజ్ గొడవ జరగడంతో, ఈ ఫైట్ మీదే అందరి కళ్లు పడ్డాయి.

* ఫైట్ ఎప్పుడు?: నవంబర్ 6 (శుక్రవారం).

* ఎక్కడ?: నిక్కి బీచ్, దుబాయ్ (Nikki Beach, Dubai).