November Movie Releases : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. 25 రోజుల్లో 30కి పైగా చిత్రాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందంటే?

November Movie Releases : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. 25 రోజుల్లో 30కి పైగా చిత్రాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందంటే?

నవంబర్ నెల టాలీవుడ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30కి పైగా చిన్న, పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కట్టాయి. పాన్ ఇండియా చిత్రాల నుంచి క్రైమ్ థ్రిల్లర్లు, హారర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వరకు అన్ని జానర్ల సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 5 నుంచి 27 వరకు బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ కనిపించనుంది.

నవంబర్ 5న రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ పార్ట్ 1' తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

 

నవంబర్ 6న సినిమాల సందడి మరింత పెరగనుంది. సూర్య, నజ్రియా నటించిన 'సీన్' (Scene) సినిమాతో పాటు నయనతార అమ్మవారి పాత్రలో కనిపించనున్న 'మహాశక్తి' (మూకుత్తి అమ్మన్ 2) విడుదల కానున్నాయి. భక్తి, వినోదం మేళవింపుగా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అంచనా. ఇక బాలల నేపథ్యంలో తెరకెక్కిన 'సమ్మర్ హాలిడేస్' కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు 'నన్నా కుట్టి' తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా అదే రోజు విడుదల కానుంది.

 

నవంబర్ 12న సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన 'జీ.ఓ.ఏ.టీ' థియేటర్లలోకి రానుంది. కామెడీ, వినోదంతో ప్రేక్షకులను నవ్వించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. అదే రోజు 'భోగి', 'ఆహ్' చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 

నవంబర్ 13న అర్జున్ దాస్ నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'జాన్ డో' విడుదల కానుంది. 17 మంది చిన్నారుల మిస్సింగ్ కేసుల చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత కథాంశం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. లోకేష్ కనగరాజ్ విడుదల చేసిన ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇదే రోజున మౌళి తనూజ్ ప్రశాంత్ నటించిన క్రైమ్ కామెడీ 'దొంగ నా కొడుకు', 'ఇట్లు అర్జున', 'చంద్రయాన్', 'డార్క్ చాక్లెట్', 'టాల్కమ్ పౌడర్', 'రోమియో జూలియట్' చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి.

 

నవంబర్ 20న దుల్కర్ సల్మాన్ నటించిన 'ఆకాశంలో ఒక తార' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ధనుష్ నటించిన 'ఓం చాప్టర్ 1 – ఉదిరమ్', కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యవాన్ సావిత్రి', ఆశిష్ గాంధీ నటించిన 'డానీ' చిత్రాలు కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి.

 

నవంబర్ 27న రష్మిక మందన్న నటించిన 'మైసా' భారీ అంచనాలతో విడుదల కానుంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త జంటగా నటించిన 'హైందవ' కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది. వీటితో పాటు 'హై', '' వంటి చిత్రాలు బాక్సాఫీస్ సందడిని మరింత పెంచనున్నాయి.

 

మొత్తానికి నవంబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలతో పాటు కొత్త కాన్సెప్ట్‌లతో వస్తున్న చిన్న చిత్రాలు కూడా పోటీ పడనున్నాయి. మరి ఈ సినిమాల్లో ప్రేక్షకుల మనసులు గెలుచుకునేవి ఏవి? బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించేవి ఏవి? అన్నది ఆసక్తికరంగా మారింది.