అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల పోలింగ్ప్రారంభం.. రేపు(బుధవారం) ఫలితాలు

అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల పోలింగ్ప్రారంభం.. రేపు(బుధవారం) ఫలితాలు

అమెరికాలో మిడ్​ టర్మ్​ ఎన్నికల  పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 3, 2026 న అమెరికా వ్యాప్తంగా మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, వర్జీనియా, మైన్‌, కెంటకీ, వెర్మాంట్‌, న్యూహ్యాంప్‌షైర్‌, ఇండియానా, కనెక్టికట్‌ రాష్ట్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ సమయం ముగిసిన వెంటనే అంటే రేపు (బుధవారం నవంబర్​ 4 ) ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ప్రతినిధుల సభ (House of Representatives) లో మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెనెట్ (Senate) లో  మొత్తం 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హౌజ్​ ఆఫ్​ రిప్రజెంటేటిల్​ లో ప్రస్తుతం రిపబ్లికన్లకు 218, డెమోక్రట్లకు 214 స్థానాలు ఉన్నాయి.  సెనెట్​ లో  రిపబ్లికన్లు 22 స్థానాలను, డెమోక్రట్లు 13 స్థానాలు ఉన్నాయి. వీటితోపాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు, రాష్ట్ర శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధ పరిణామాలు, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రభావం చూపుతున్నాయి. ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. ట్రంప్​ భవిష్యత్తు నిర్ణయాలు, విధానాలతో  కాంగ్రెస్‌పై ఏ పార్టీకి పట్టు చిక్కుతుందనేదానికి ఆసక్తికరంగా మారింది.