వైయస్ ఆర్సీపీ చీఫ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయిన పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. 2026 నవంబర్ 3న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ , - జనసేన - బీజేపీ కూటమి ఘనవిజయం సాధించాయి.
వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగన్ చిన్నమ్మ వైయస్ ప్రమీలమ్మపై టీడీపీ అభ్యర్థి గీతాకుమారి విజయం సాధించారు. 13 వేల 898 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
మొత్తం వార్డులు 40 వార్డులలో కూటమి 37 వార్డులు గెలుచుకుంది. అందులో టీడీపీ 34, బీజేపీ 2, కూటమి బలపర్చిన వ్యక్తి ఒక్క స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక వైసీపీ 3 వార్డులు దక్కంచుకుంది.
మొదటి రౌండ్ నుంచీ టీడీపీ అభ్యర్థి ఆధిపత్యం సాధిస్తూ వచ్చారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి తూగుట్ల గీతాకుమారి 6 వేల325 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు 13 వేల 898 ఓట్ల మెజారిటీ సాధించారు.
