సినీ ఇండస్ట్రీలో లో కొన్ని స్నేహాలు ఎప్పటికీ స్పెషల్‌గానే ఉంటాయి. అలాంటి అరుదైన స్నేహాల్లో అజయ్ దేవగన్, టబుల బంధం ఒకటి.. ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్న ఈ ఇద్దరూ వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరిస్తూనే, బయట కూడా తమ చిలిపి సంభాషణలతో నవ్వులు పూయిస్తుంటారు. ఈ రోజు( నవంబర్ 4, 2026 ) టబు పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరికీ సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. అందులో టబు పెళ్లి గురించి అజయ్ దేవగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో " టబు ఇప్పటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?" అని అజయ్ దేవ్గన్ ని ప్రశ్నించగా.. తనదైన మార్క్ కామెడీతో ఊహించని ఆన్సర్ ఇచ్చారు. "ఆమె నాలాంటి గుణాలున్న అబ్బాయి కోసం చూస్తోంది. కానీ, నాలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం కదా!" అంటూ నవ్వేశారు. దీనికి టబు ఏమాత్రం తగ్గకుండా "కరెక్టే మై జాన్.. నేను కూడా అదే అర్థం చేసుకున్నా" అంటూ అజయ్ చేతిని పట్టుకుని ప్రేమగా ముద్దుపెట్టుకోవడం అక్కడ వాతావరణాన్ని మరింత క్రేజీగా మార్చేసింది.
అంతే కాదు "నన్ను భరించేంత ఓపిక, విలక్షణమైన క్యారెక్టర్ నీకు తప్ప వేరెవరికీ ఉండవు" అంటూ టబు చమత్కరించారు. అంతేకాదు, "నేనింకా సింగిల్‌గానే ఉన్నాను, కానీ నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండిపోయావ్" అని గుర్తుచేసి అందరినీ నవ్వించారు. విజయ్‌పథ్, తక్షక్, దృశ్యం సిరీస్, దృశ్యం 2, భోలా లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకాదరణ పొందిన ఈ జోడీ, ముప్పై ఏళ్లకు పైగా అత్యంత ఆత్మీయ మిత్రులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వీరి మధ్య డేటింగ్ రూమర్స్ వచ్చినా, వీరు మాత్రం 'బెస్ట్ ఫ్రెండ్స్'గానే నిలిచారు.
ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలసి 'భూత్ బంగ్లా'లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు జోడీ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతోంది. అజయ్ దేవ్గన్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్స్ అయిన 'రైడ్ 2', 'సన్ ఆఫ్ సర్దార్ 2', 'దే దే ప్యార్ దే 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా, టబు బర్త్‌డే వేళ ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
