Jailer 2 OTT Release: ఓటీటీలోకి రజనీకాంత్ 'జైలర్ 2' అన్‌కట్ వెర్షన్.. 30 నిమిషాల అదనపు సీన్లతో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jailer 2 OTT Release: ఓటీటీలోకి రజనీకాంత్ 'జైలర్ 2' అన్‌కట్ వెర్షన్.. 30 నిమిషాల అదనపు సీన్లతో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ' జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.816 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో రూ.463 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టగా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బలమైన ప్రదర్శన కనబరిచింది. తమిళనాడులో రూ.213 కోట్లకు పైగా వసూళ్లతో విజయ్ 'లియో’ రికార్డుకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే దిశగా దూసుకెళ్తోంది.

అయితే నవంబర్ 5న 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్', నవంబర్ 6న సూర్య 'సీన్', నయనతార 'మూకుత్తి అమ్మన్ 2' వంటి సినిమాలు బరిలోకి దిగుతుండటంతో 'జైలర్ 2' థియేటర్లలో స్క్రీన్ల పోటీని ఎదుర్కోనుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా తన స్టైల్, స్వాగ్‌తో ప్రేక్షకులను అలరించారు. అయితే మోహన్‌లాల్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్, సంతానం వంటి ప్రముఖ నటుల పాత్రలకు థియేట్రికల్ వెర్షన్‌లో తక్కువ స్క్రీన్ టైమ్ దక్కిందనే చర్చ అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. 

ముఖ్యంగా మోహన్‌లాల్ అభిమానులు ఆయన పాత్ర నిడివిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో కనిపించిన సంతానం సన్నివేశాలు కూడా సినిమాలో లేకపోవడం చర్చనీయాంశమైంది. థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'జైలర్ 2' ఇప్పుడు ఓటీటీలోనూ సరికొత్త రికార్డులకు తెరతీసేందుకు రెడీ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన సీన్లతో కలిపి ఏకంగా 30 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ విడుదల కానుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే 30 నిమిషాల అదనపు ఫుటేజ్, అన్‌కట్ వెర్షన్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 10 తర్వాత డిజిటల్ ప్రీమియర్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఓటీటీలో అన్ కట్ వెర్సన్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.