74 పరుగులతో చెలరేగిన కోహ్లీ.. కివీస్‌పై టీమిండియా జయభేరి!

74 పరుగులతో చెలరేగిన కోహ్లీ.. కివీస్‌పై టీమిండియా జయభేరి!

IND vs NZ 1st ODI: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా మళ్లీ మళ్లీ వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తన 38వ పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందు (నవంబర్ 5న బర్త్‌డే) విరాట్ కోహ్లీ కిరాక్ ఇన్నింగ్స్‌తో చెలరేగి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు.

74 రన్స్‌తో దుమ్మురేపిన కోహ్లీ:

186 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వర్షం ఆటంకం కలిగించినప్పటికీ.. విరాట్ కోహ్లీ తన అనుభవంతో మ్యాచ్‌ను శాసించాడు. కోహ్లీ 74 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37 పరుగులు) కోహ్లీకి చక్కటి సహకారం అందిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.  

దారుణంగా నిరాశపరిచిన రోహిత్, అక్షర్:

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుతిరగిన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్, కోహ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈక్రమంలో 124 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయిన కింగ్.. తర్వాత మైదానంలోకి వచ్చిన అక్షర్ పటేల్ (0) ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే దూకుడుగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ (15) కూడా ఔట్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లతో (3/49) భారత్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేయగా, నాథన్ స్మిత్, కైల్ జామీసన్‌లు తలో వికెట్ పడగొట్టారు.