IND vs NZ 1st ODI rain: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. 186 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసి విజయవంతంగా ముందుకు కొనసాగుతున్న సమయంలో ఆక్లాండ్‌లో ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. దీంతో మైదానంలోకి కవర్లను తీసుకురావడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ పటిష్టమైన స్థితిలో ఉన్నారు.
వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్:
ఈ మ్యాచ్‌కు ముందే వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉదయం కూడా వర్షం కారణంగా టాస్ 20 నిమిషాలు ఆలస్యంగా పడింది. ప్రస్తుతం వర్షం పడుతున్నప్పటికీ.. మ్యాచ్ జరిగే కొద్ది గంటల్లో వర్ష సూచన కేవలం 20 శాతమే ఉన్నట్లు వాతావరణ నివేదికలు తెలుపుతున్నాయి. కాబట్టి ఈ ఆటంకం తాత్కాలికమే కానుంది.
డక్ వర్త్ లూయిస్ (DLS):
ఒకవేళ వర్షం ఎక్కువై మ్యాచ్ ఆలస్యమైతే ఓవర్లను కుదించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం (DLS Rule) ఫలితం తేలాలంటే టీమిండియా కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది (లేదా అంతకంటే ముందే లక్ష్యాన్ని ఛేదించాలి). ప్రస్తుతం భారత్ 54 పరుగులు పూర్తి చేసుకుంది కాబట్టి, వర్షం తగ్గి ఆట పునఃప్రారంభం కాగానే టీమిండియా త్వరితగతిన మ్యాచ్‌ను ముగించేందుకు ప్రయత్నించనుంది.
Rain stops play in Auckland. Stay tuned for further updates Live ▶️ https://t.co/iZN2Y53Nur #TeamIndia | #NZvIND
— BCCI (@BCCI) November 4, 2026
