మేకప్ కిట్ దాదాపుగా అందరి దగ్గరా ఉంటోంది. స్పెషల్ అకేషన్స్ లో మాత్రమే మేకప్ వేసుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా లాంటివి హ్యాండ్ బ్యాగ్ లో ఉంటున్నాయి. ప్రతీరోజూ" వాడుతున్నప్పుడు ఆ బ్రష్ లు, మిగతా వస్తువులు శుభ్రంగా ఉండటం చాలా అవసరం. అవి క్లీన్ గా లేకపోతే చాలా సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే...
- రోజూ మేకప్ నకు వాడే క్రీమ్స్, లోషన్స్ అవే కానీ చర్మం దురదగా అనిపించినా, రాషెస్ వచ్చినా అందులో బ్యాక్టీరియా ఉన్నట్లే.
- మేకప్నకు వాడే బ్రష్ లు క్లీన్ గా ఉండాలి. ఫౌండేషన్, పౌడర్ లాంటి చేతులతో తాకొద్దు.
- వారానికి ఒకసారైనా బ్రష్ లను శుభ్రం చేయాలి. మేకప్ బ్రష్, ప్లక్కర్ లాంటివి ఆల్కహాల్ స్ప్రేతో క్లీన్ చేయాలి.
- లిప్ స్టిక్‌ను రోజూ వాడుతుంటే కనుక ప్రతిరోజూ ఆల్కహాల్ చల్లిన టిష్యూ పేపర్ తో తుడిచాక మాత్రమే వాడాలి.
- ఒకరు వాడిన మేకప్ కిట్ ను మరొకరు షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా లిప్ స్టిక్, హెయిర్ బ్రష్, దువ్వెన లాంటివి. అస్సలే షేర్ చేసుకోవద్దు.
- మేకప్ కిట్, బ్రష్ లు ఉంచే ప్లేస్ కూడా పొడిగా శుభ్రంగా ఉండాలి.
