Childrens special: దీపావళి ఇంటి దీపాలు.. పిల్లలతో తయారీ.. అందంగా భలే మెరుస్తూ ఉంటాయి..!

Childrens special:  దీపావళి ఇంటి దీపాలు.. పిల్లలతో తయారీ.. అందంగా భలే మెరుస్తూ ఉంటాయి..!

దీపావళి పండుగ విషయంలో  చిన్నారుల్లోని క్రియేటివిటీని బయటకు తెచ్చి, ఈ పండుగను వాళ్లకు స్పెషల్​ గా మార్చవచ్చు. కొంచెం ఎఫర్డ్ పెడితే సమ్ థింగ్ స్పెషల్ దీపావళి అనిపిందుకుంటుంది ఈ పండుగ. మరి పిల్లలతో చేయగలిగే కొన్ని వన్ యాక్టివిటీస్ ఏంటో చూద్దామా...

పిల్లలు బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్స్ దీపావళి ఒకటే. దీపాలు వెలిగే ఇంట్లో పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. వాళ్లకెష్టమైన క్రాకర్స్ పిలుస్తూ భలే ఎంజాయ్ చేస్తాడు.  పండుగ జోష్ లో , క్రాకర్స్  కాలుస్తుంటారు. 

మార్కెట్లో దొరికే రకరకాల క్యాండిల్స్​, ఎలక్ట్రిక్​ లైట్స్​తో డెకరేట్​ చేస్తారు. అయితే ఇలా ఎప్పుడూ బయట తయారు చేసినవే కాకుండా, ఇంట్లో పిల్లలతో కొన్ని ఐటమ్స్ తయారు చేయించొచ్చు. కాస్త ఖాళీ టైమ్ దొరికితే మంచి ఐటమ్స్ చేయించొచ్చు.  దీనికి కావాల్సిందల్లా పిల్లలో ఉత్సాహం, క్రియేటివిటీ! పేరెంట్స్ ఎంకరేజ్​ మెంట్​ అంతే! ఇంట్లో పిల్లలు తయారు చేసిన డ్రాఫ్ట్ అండ్ కార్వేటివ్ ఐటమ్స్ రెడీ.

పేపర్ లీఫ్ గార్లాండ్

రంగురంగుల కాగితాలతో ఆకుల్లాగ తయారు చేసిన వాటిని డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఇది చేయడం చాలా సింపుల్ 


దీనికి కావాల్సినవి


 ప్రింటల్ లీఫ్ టెంప్లెట్. ఇది లేకపోతే.. చిన్న సైజ్లో ఉండే ఒక ఆకు తీసుకుని దాని సైజ్ లో పేపర్స్ కట్ చేయాలి. కార్డ్ స్టాక్​ పేపర్స్.. (డిఫరెంట్ కలర్స్), సిజర్స్ గ్రిట్టర్ జెల్ పెన్, టైన్ దారం (గట్టిగా ఉండే దారం) హోల్ పంచ్. 

తయారీ విధానం : మందంగా ఉండే కార్ట్​ స్టాక్​ పేపర్స్​ ను  ప్రింటబుల్ లీఫ్ లేదా కావాల్సిన కాకు సైజ్​ లో  కట్ చేయాలి. ఈ ఆకులపై జెల్ పెన్​తో గీతలాగ ఆకు మధ్యలో, పక్కన సిరలు గీయాలి. ఆకు పై భాగంలో హోల్ ఫంచ్​తో  చిన్న హోల్స్ చేయాలి. ఈ హోల్స్ మధ్యలోంచి దారాన్ని గుచ్చి, అన్నీ కలపాలి. అయితే ఒక కలర్ ఆకు పక్కన మరో కలర్​ ఆకు వచ్చేలా చూడాలి.


ఇలా అన్ని రంగులు అయిపోయాక దారపు కొనల్ని కావాల్సిన చోట కట్టొచ్చు.. లేదా గ్రూతో గోడకు అతికించొచ్చు. రంగురంగుల పేపర్ లీవ్స్​  చూడగానే ఆకట్టుకుంటాయి. 


దీపావళి వెలుగుల్లో ఈ ఆకులు మెరుస్తూ ఇంటికి కొత్త కాంతిని తీసుకొస్తాయి. అయితే ఒకే సైజ్, ఒకే కలర్ ఒకే డిజైన్ ఆకుల్నే ఫాలో అవ్వక్కర్లేదు. పిల్లల క్రియేటివిటీని బట్టి రకరకాల డిజైన్స్ ట్రై చేయొచ్చు.


పేపర్ లాంతర్

ఈ రోజుల్లో చాలా కామన్ గా దొరుకుతున్న చాకొలెట్​ ఐటమ్ పేపర్ లాంతర్ మార్కెట్లో రకరకాల డిజైన్స్​ పేపర్ లాంతర్స్ దొరుకుతున్నాయి. కానీ, వీటిని పిల్లలు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. దీనికి కలర్​ పేపర్స్, హోల్ పంచ్, గ్లూ, సిజర్ కావాలి. ముందుగా పేపర్స్ ను మధ్యలో సగానికి మడిచి, రెండు వైపులా చివర్లో ఒక అంగుళం వరకు వదిలేసి మధ్యలో అర అంగుళం దూరంలో, పొడవుగా కట్ చేయాలి. 

ALSO READ : కుమ్మరి కుండకు ‘మట్టి’ కష్టాలు..కూజా, ముంత, దీపాంతలు తయారీకి ఊరూరా అవస్థలే..

పేపర్ పై భాగంలో కూడా ఒక అంగుళం వదలాలి. ఇలా కట్ చేసుకొన్న పేపర్పై హోల్ పంచ్ ఇష్టమైన చోట హోల్స్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్స్ ను వృత్తంగా చుట్టి గ్లూతో రెండు చివర్లు అతికించాలి. వీటిని కట్ చేసిన చోట సగం నుంచి కొంచెం మడిస్తే చాలు. పేపర్ లాంతర్ రెడీ అవుతుంది. ఈ పేపర్స్ ను నేలపై ఉంచి, మధ్యలో టీ క్యాండిల్స్ పెడితే కలర్ ఫుల్​ గా  మెరుస్తుంటాయి.

బ్యాంగిల్ దియాస్

వాడని చేతి గాజులు ఉంటే వాటితో బ్యాంగిల్ దియాస్ తయారు చేయొచ్చు. దీనికి ఒకే సైజ్​ లో  ఉండే గాజులు,గ్లూ, టీక్యాండిల్ అట్టముక్క ఉంటే చాలు. గాజులను వరుసగా ఒకదానిపై ఒకటి కలుపునుతూ, గ్లూతో అతికించాలి. వీటిని అట్టముక్కపై అతికించాలి. 

మధ్యలో టీ క్యాండిల్ వెలిగిస్తే. రాత్రిపూట కలర్ ఫుల్ గా  కలిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్​ లో మెరిసే గాజుల మధ్య ఉండే దీపంలా చూడగానే ఆకట్టుకుంటుంది. మీ టేస్టు బట్టి పిల్లలతో కావాలసిన బ్యాంగిల్ దియాస్ తయారు చేయించొచ్చు.