దీపావళికి ముందు ధనత్రయోదశి.. దంతేరాస్ పండుగను జరుపుకుంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు చాలా శుభదినమని పండితులు చెబుతున్నారు. ధన త్రయోదశి రోజు బంగారం... వెండి.. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిదని.. అభివృద్ది జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా మంది బంగారం.. వెండి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరి ఈ ఏడాది నవంబర్ 6 వ తేదీన ధనత్రయోదశి శుభదినం వచ్చింది. మరి అలాంటి పవిత్రమైన రోజు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .!
ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల వారు తమ రాశికి అనుగుణంగా కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతారు.
దీపావళి పండుగకు ముందు వచ్చే ధన త్రయోదశి (ధంతేరస్)ఈ రోజును సంపద, ఆరోగ్యం, శుభారంభాలకు ప్రతీకగా భావిస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, రాగి, ఇత్తడి వస్తువులు, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం మన రాశిని బట్టి కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిదని చెబుతారు.
ఏ రాశి వారు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి
- మేష రాశి: రాగి చెంబు, కలశం, దీపం , పూజా సామగ్రి , రోజువారీ ఉపయోగపడే పనిముట్లు
- వృషభ రాశి: వెండి నాణెం, వెండి వస్తువు , ఇంటి అలంకరణ వస్తువులు
- మిథున రాశి: ఇత్తడి దీపారాధన కుంది, పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్స్ ,విద్యకు సంబంధించిన వస్తువులు
- కర్కాటక రాశి: వెండి నాణెం, వెండి గిన్నె , వంటింటికి అవసరమైన కొత్త పాత్రలు
- సింహ రాశి: బంగారం, రాగి పాత్ర లేదా రాగి దీపం
- కన్యా రాశి: ఇత్తడి పాత్రలు, దీపాలు, కొత్త ఖాతా పుస్తకాలు, ఆఫీస్‌కు అవసరమైన వస్తువులు
- తులా రాశి: వెండి నాణెం, వెండి దీపం, ఇంటికి అందాన్ని తెచ్చే వస్తువులు
- వృశ్చిక రాశి: రాగి పాత్రలు, రాగి దీపాలు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే పనిముట్లు
- ధనుస్సు రాశి: ఇత్తడి పూజా వస్తువులు, బంగారు నాణెం , ఆధ్యాత్మిక పుస్తకాలు
- మకర రాశి: గృహోపకరణాలు, వెండి వస్తువులు
- కుంభ రాశి: వెండి నాణెం, పూజా వస్తువులు, కొత్త గ్యాడ్జెట్లు , ఇంటికి ఉపయోగపడే వస్తువులు
- మీన రాశి: ఇత్తడి కలశం, దీపం, బంగారు నాణెం , ఆధ్యాత్మిక పుస్తకాలు
అందరూ కొనగలిగే వస్తువులు
రాశులతో సంబంధం లేకుండా బంగారం, వెండి నాణేలు, ఇత్తడి లేదా రాగి పాత్రలు, దీపాలు, కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేయడం సంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారం, వెండి తప్పనిసరిగా కొనాలనే నియమం లేదు. చిన్న మట్టి ప్రమిద లేదా ఇంటికి అవసరమైన వస్తువు కొనుగోలు చేసినా పండుగను ఆనందంగా జరుపుకోవచ్చుని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
